సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే మహేష్ ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించాడు. అలాగే మహేష్ కొన్ని ఫ్లాప్ మూవీలలో కూడా నటించాడు. కానీ మహేష్ నటించిన కొన్ని సినిమాలు ఆ సమయంలో కొన్ని పరిస్థితుల వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన కూడా ఆ తర్వాత ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సినిమాలు కూడా ఉన్నాయి.

అలా మహేష్ కెరియర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినా కూడా ఆ తర్వాత ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సినిమాలలో ఖలేజా మూవీ ఒకటి. ఈ మూవీ లో మహేష్ కి జోడిగా అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించగా ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రకాష్ రాజ్మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... మణిశర్మమూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే భారీ అంచనాల నడుమ 2010 వ సంవత్సరం విడుదల అయిన బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.

బాక్స్ ఆఫీస్ దగ్గర అయిన ఈ సినిమా బుల్లితెరపై ఎప్పుడు ప్రసారం అయిన కూడా అద్భుతమైన టి ఆర్ పి రేటింగ్ ను తెచ్చుకుంటుంది. దానితో ఈ సినిమాను థియేటర్ లలో మళ్ళీ రీ రిలీస్ చెయ్యాలి అని ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ రీ రిలీజ్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమా కనుక రీ రిలీజ్ అయితే ఎలాంటి రెస్పాన్స్ ను ప్రేక్షకుల నుండి తెచ్చుకుంటుందో చూడాలి. ఇప్పటికే మహేష్ హీరోగా రూపొందిన కొన్ని సినిమాలు రీ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: