టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఈ మధ్య కాలంలో కాస్త సినిమాల స్పీడును తగ్గించాడు. పోయిన సంవత్సరం కూడా నాగార్జున దాదాపు సగం సంవత్సరం ముగిసిన తర్వాత నా సామి రంగ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . కాక పోతే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విజయ్ బిన్నీ చాలా పర్ఫెక్ట్ గా అనుకున్న సమయాని కి ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తూ వచ్చి ఈ సంవత్సరం సంక్రాంతి కి ఈ మూవీ ని విడుదల చేశాడు.

సినిమా మంచి విజయం అందుకుంది. ఇక ఇప్పటి వరకు నాగార్జున ఒక సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇక నాగార్జున మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోయే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కి హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు కు సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. దానితో నాగార్జున కూడా బిగ్ బాస్ పై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇలా నాగార్జున సినిమా ఓకే చేయకుండా ఉండడంతో ఆయన అభిమానులు కాస్త నిరుత్సాహంగా ఉన్న బిగ్ బాస్ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతోంది అని తెలియడంతో ఆయనను బుల్లి తెరపై వారంలో రెండు రోజులు చూడవచ్చు అని ఆనందపడుతున్నారు.

ఇలా నాగార్జున ఓ వైపు తన అభిమానులను ఆనంద పెడుతూనే మరో వైపు బాధపెడుతున్నాడు. మరి నాగార్జున "బిగ్ బాస్" తో పాటు ఒక సినిమాను కూడా ఓకే చేసి ఆ సినిమా షూటింగ్ తో బిజీ అయి వారి ముందుకు ఒక సినిమాను తీసుకు వస్తే ఆయన అభిమానులు అన్ని రకాలుగా ఆనంద పడతారు. మరి నాగార్జున నెక్స్ట్ మూవీ కి సంబంధించిన అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: