నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే అండ్ దిశా పతాని హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ చిత్రం కల్కి. ఇక ఈ చిత్రంలో వీరితోపాటు అమితాబచ్చన్ అండ్ కమల్ హాసన్ కూడా ప్రత్యేక పాత్రలు పోషించారు. ఈ మూవీ జూన్ 27వ తారీఖున ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్ ఐ నేటితో 13 రోజులు పూర్తయింది. ఇక నిన్న అనగాజుల 8వ తారీఖున ఈ సినిమా 11.35 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ రాబట్టింది.


అంటే ఇది పదో రోజు వచ్చిన 44.35 కోట్ల కంటే చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అయినా మిడ్ వీక్ లో 11 కోట్లతో మంచి కలెక్షన్స్ నే రాబట్టింది ఈ సినిమా. ఇక వీటిలో తెలుగు నుంచి మూడున్నర కోట్లు తమిళ్ నుంచి 7 లక్షలు, హిందీ నుంచి తక్కువగా 6:30 కోట్లు, కన్నడ నుంచి 15 లక్షలు, మలయాళం నుంచి అతి తక్కువగా 5 లక్షల కలెక్షన్స్ ఉన్నాయి. 12వ రోజున భాషల వారీగా వచ్చిన కల్కి కలెక్షన్స్ ఇవే.


ఇక ఈ సినిమా 12 రోజుల్లో అంటే ఇప్పటివరకు భారత్ లో రూ. 521.4 కోట్ల కలెక్షన్స్ చేసినట్లు ప్రముఖ ట్రెండ్ సంస్థలు తెలిపాయి. ఇక ఈ కలెక్షన్స్ లో భాషల వారీగా చూస్తే.. తెలుగు నుంచి 249.05  కోట్లు, తమిళ్ నుంచి 30.5 కోట్లు, హిందీ నుంచి 218. 9 కోట్లు, కన్నడ నుంచి 4. 15 కోట్లు, మలయాళం నుంచి 18.8 కోట్లు గా ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే కల్కి చిత్రం వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకు 900 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ మూవీ 12వ రోజుతో 950 కోట్ల కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ట్రెండ్ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: