కొంత మంది హీరోలు కెరియర్ ప్రారంభంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు. కానీ ఆ తర్వాత వారు నటించిమా సినిమాలు బోల్తా కూడుతూ ఉండడంతో వారి క్రేజ్ చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. ఇక ఆల్మోస్ట్ కెరియర్ ముగిసిపోతుంది అనే సమయానికి హిట్ కొట్టి మళ్ళీ ఫుల్ జోష్ లోకి వచ్చిన హీరోలు కొంత మంది ఉన్నారు. ఆ హీరోలు ఎవరు అనే విషయం తెలుసుకుందాం.

తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో నిఖిల్ ఒకరు. ఈయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన హ్యాపీ డేస్ అనే మూవీ తో తెలుగు తేరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ లో రాజేష్ పాత్రలో నటించిన ఈయనకు మంచి గుర్తింపు లభించింది. ఇక ఈ సినిమా తర్వాత ఈయనకు వరుసగా అవకాశాలు రావడం మొదలు అయ్యింది. అందులో భాగంగా ఈయన కూడా చాలా సినిమాలలో నటించాడు. కానీ ఈయన నటించిన ఏవో ఒకటి, రెండు సినిమాలు తప్పిస్తే ఏవి పెద్దగా విజయాలను అందుకోలేదు.  ఈయన కెరియర్ ఆల్మోస్ట్ ముగిసిపోయింది అనే టైం లో ఈయన స్వామి రారా అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత నుండి ఈయన ఆచితూచి కథలను ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకుంటూ వస్తున్నాడు. దానితో ప్రస్తుతం ఈయన తెలుగులో మంచి గుర్తింపు కలిగిన నటుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.


గోపీచంద్ మొదట హీరో గా కెరియర్ ను మొదలు పెట్టాడు. కానీ ఈయన హీరోగా నటించిన మొదటి సినిమా ఫ్లాప్ కావడంతో ఆ తర్వాత విలన్ పాత్రలలో నటించడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత మళ్లీ యజ్ఞం మూవీ తో హీరోగా కెరియర్ ను స్టార్ట్ చేశాడు. అలా కెరియర్ ముందుకు సాగుతున్న సమయంలో ఈయనకు యజ్ఞం తర్వాత వరుసగా విజయాలు వచ్చాయి. దానితో గోపీచంద్ క్రేజ్ భారీగా పెరిగింది. కానీ మళ్ళీ ఈయనకు వరుసగా అపజాయలు రావడం మొదలు అయింది. అలాంటి సమయంలో ఈయన సిటిమార్ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: