నటి దిశ పటాన్ని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. లోఫర్ సినిమాతో టాలీవుడ్ అని ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఆ తర్వాత బాలీవుడ్ ని ఇండస్ట్రీకి వెళ్ళింది. అలా దిగవంత హీరో సుశాంత్  నటించిన ధోని సినిమా తో హీరోయిన్ గా భారీ గుర్తింపు సంపాదించుకుంది. అలా ఆ సినిమా తర్వాత తనకి బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. బాలీవుడ్ కి వెళ్ళిపోయిన తర్వాత తనకి అక్కడ వరకు అవకాశాలు రావడంతో టాలీవుడ్ ను మరిచిపోయిన ఈ నటి తాజాగా మళ్లీ కల్కి సినిమాతో ఆడియన్స్ అను పలకరించింది. ఫ్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్గా

 నటించిన ఈ సినిమాలో దిశా పటాని సైతం ఒక కీలక పాత్రలో కనిపించింది. ఇకపోతే ఈ సినిమాలో తన పాత్ర పెద్దగా లేకపోయినప్పటికీ తనకి సినిమాతో మంచి మార్కులే పడ్డాయి. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అమితాబచ్చన్ కమలహాసన్ వంటి భారీ స్టార్ కాస్టింగ్ ఉన్న ఈ సినిమా విడుదలై 11 రోజులు కావస్తున్నప్పటికీ వసూళ్ల విషయంలో మాత్రం దంచి కొడుతుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. కల్కి విడుదలై రెండు వారాలు అవుతున్నప్పటికీ 900 కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అయితే విడుదల సమయంలో దిశా చేతిపై పీడీ (PD) టాటూ కనిపించడంతో నెట్టింట

 పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో కొత్త టాటూతో కనిపించింది దిశా. ప్రభాస్ కల్కి తో తన అనుభవాన్ని షేర్ చేస్తూ కొన్ని ఫోటోస్, వీడియోస్ పంచుకుంది దిశా పటాని. ఇందులో ఈ బ్యూటీ నడుముపై అర్థం కానీ విదేశీ భాషలో ఉన్న టాటూ కనిపించింది. ఇది చూసిన నెటిజన్స్ అసలు ఆ టాటూ అర్థమేంటనీ తెగ ఆరా తీస్తున్నారు. ఆ టాటూ అర్థం తెలుసుకోవడానికి తెగ ట్రై చేస్తున్నారు. దిశా నడుము మీద ఉన్న టాటూ హీబ్రూ భాషలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్, ఆసియా, ఆఫ్రికా మధ్య ఉండే కొన్ని దేశాల్లో ఈ భాష మాట్లాడతారు. 'అతడు నమ్మే ప్రతిదీ పొందవచ్చు' అని ఆ టాటూ అర్థమని తెలుస్తోంది. ఇక దిశా కొత్త టాటూపై ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: