ఒకప్పుడు తమిళ సినీ ఇండస్ట్రీని ఏలిన సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. దాదాపుగా 80 సంవత్సరాల దగ్గరలో ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికీ యంగ్ హీరోలకి ధీటుగా వరుస సినిమాలు చేస్తూ పోతున్నాడు. సాహూసపేతమైన సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇప్పటికీ స్టార్ గా కొనసాగుతున్నాడు. ఇప్పటికీ సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపుతున్నాడు. ప్రస్తుతం వరుసగా స్టార్ డైరెక్టర్లను లైన్ లో పెడుతున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఈ వయసులో కూడా ఏమాత్రం అలసిపోకుండా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లతో కమిట్

 అయిన సినిమాలకు సంబంధించిన షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ఇకపోతే గత సంవత్సరం జైలర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు సూపర్స్టార్ రజనీకాంత్ తాజాగా ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా సమాచారం వినబడుతుంది .. నిజానికి వెట్టయాన్ అనే సినిమా ఈ సంవత్సరం రిలీజ్ అవుతుంది అనే అంచనాలు ఉన్నాయి. ఇక వీటితోపాటుగా మరి కొంతమంది స్టార్ డైరెక్టర్లు కూడా రజనీకాంత్ కు కథలు వినిపించడానికి సిద్దమవుతున్నట్టుగా తెలుస్తుంది. అందులో తమిళ్ సినిమా డైరెక్టర్ అయిన కార్తీక్ సుబ్బరాజ్ ఒకడు. ఇక తెలుగు సినిమా

 దర్శకులు కూడా కొంతమంది రజనీకాంత్ తో సినిమా చేయాలని ఉత్సాహం చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి రజనీకాంత్ మాత్రం చాలా జాగ్రత్తగా కథలను సెలక్ట్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. తెలుగు దర్శకుడు అయిన వెంకీ అట్లూరి కూడా రజనీకాంత్ తో సినిమా చేయాలని చూస్తున్నాడట. ఇక ఈయన గత సంవత్సరం ధనుష్ ను హీరోగా పెట్టి ‘సార్ ‘అనే సినిమా తీసి సక్సెస్ ను అందుకున్నాడు. కాబట్టి రజనీకాంత్ కి కూడా తను ఒక కథ వినిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి రజనీకాంత్ ఆ కథ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…అలా ప్రస్తుతం వరుసగా స్టార్ డైరెక్ట్ లతో సినిమాలకి కమిట్ అవుతున్నాడు సూపర్స్టార్ రజినీకాంత్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: