ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ కి అత్యధిక అసెంబ్లీ స్థానాలు రావడంతో తెలుగు దేశం పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై సీ పీ పార్టీ అధికారంలో ఉంది. ఇక వై సి పి పార్టీ అధికారంలో ఉన్న సమయం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలు అత్యంత తక్కువ ధరకు ఉండేవి. దాని కారణంగా కొన్ని పెద్ద సినిమాలకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన కూడా పెద్ద మొత్తంలో కలక్షన్ లు రాలేదు.

ఇక తాజాగా హనుమాన్ సినిమా నిర్మాత అయినటువంటి చైతన్య రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పుష్ప , బీమ్లా నాయక్ సినిమాలను విడుదల చేసినట్లు , వాటి ద్వారా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాము అనే వివరాలను తాజాగా చెప్పుకొచ్చింది. తాజాగా ఈమె మాట్లాడుతూ ... గత ప్రభుత్వం ఉన్న సమయంలో మేము పుష్ప మరియు భీమ్లా నాయక్ సినిమాలను ఆంధ్రప్రదేశ్ లో డిస్ట్రిబ్యూట్ చేశాము. వాటికి వచ్చిన జనాలకి మంచి రేట్లు ఉంటుంటే మంచి నెంబర్స్ కనపడేవి , లాభాలు చూసేవాళ్ళం. కానీ టికెట్ రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి. భీమ్లా నాయక్ కి పొలిటికల్ ప్రెజర్స్ గట్టిగా ఉన్నాయి అని ఈమె తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చింది.

ఇకపోతే పుష్ప మూవీ లో అల్లు అర్జున్ హీరో గా నటించగా ... రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. సుకుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక భీమ్లా నాయక్ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుపాటి రానా కూడా హీరో గా నటించాడు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే ను అందించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: