తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మహేష్ బాబు నెంబర్ వన్ హీరోగా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా.. తెలుగు ప్రేక్షకులందరికీ నేటితరం సూపర్ స్టార్ గా మారిపోయాడు మహేష్ బాబు. అయితే మహేష్ బాబు కెరియర్ లో ఇప్పటివరకు ఇండస్ట్రీ హిట్గా నిలిచిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ హీట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయని చెప్పాలి. అలాంటి వాటిలో ఒక్కడు సినిమా కూడా ఒకటి.


 వరుస ప్లాపులతో సతమతమవుతున్న సమయంలో మహేష్ బాబు కెరీర్ ని మలుపు తెప్పిన సినిమా ఒక్కడు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబును పవర్ ఫుల్ గా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. గుణశేఖర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కింది అన్న విషయం తెలిసిందే. 2003లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు నుంచే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించ గలిగింది అని చెప్పాలి. ఇక ఇప్పటికీ కూడా నేటితరం ప్రేక్షకుల్లో ఒక్కడు సినిమాకి ప్రత్యేకమైన క్రేజీ ఉంది. ఈ సినిమా టీవీల్లో వచ్చిన కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే ఇక ఇప్పుడు ఒక్కడు సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాకు ముందుగా ఒక్కడు అనే టైటిల్ అనుకోలేదట. ఈ వేరే టైటిల్ పెట్టాలని అనుకున్నాడట డైరెక్టర్ గుణశేఖర్. అతడే ఆమె సైన్యం అనే సినిమా టైటిల్ పెట్టాలని అనుకోగా.. అప్పటికే దాన్ని వేరే ఎవరు రిజిస్టర్ చేయించుకున్నారట. తర్వాత కబడ్డీ అనే టైటిల్ పెట్టాలని అనుకున్నారట. కానీ చివరికి ఒక్కడు అయితే బాగుంటుందని దానికి ఫిక్స్ అయ్యారట. ఇక మరో విషయం ఏంటంటే బ్యాట్మెంటన్ స్టార్ అయినా పుల్లల గోపీచంద్ ఇంటర్వ్యూ ని ఓ సమయంలో చూసిన గుణశేఖర్ ఇక ఒక్కడు కథను రాసుకొని మహేష్ తో తెరకెక్కించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: