నాగ్ అశ్విన్ డైరక్షన్‌లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బ్లస్టర్ మూవీ 'కల్కి 2898 AD'. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తూ దూసుకెళ్తోంది. సౌత్, నార్తే కాకుండా ఇంటర్నేషనల్గానూ ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు బారులు తీస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం మూడు రోజుల్లో రూ.415 కోట్లుకుపైగా వసూళ్లు సాధించిందని మూవీ యూనిట్ ప్రకటించింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ కన్ఫార్మ్ అయ్యిందని, తెలుగు, మలయాళ,ల తమిళ, కన్నడ భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్, అలాగే హిందీ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ సొంతం చేసుకున్నట్లు టాక్ వచ్చింది.ఇదిలా ఉంటే థియేట్రికల్ రిలీజ్ తర్వాత సుమారు 7-8 వారాల తర్వాతే కల్కి సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని కల్కి నిర్మాతలు ఓటీటీ సంస్థలతో ముందే డీల్ కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగానే స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15 నుంచి ‘కల్కి’ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది. ఎందుకంటే అది లాంగ్ వీకెండ్ కాబట్టి ఎక్కువ మంది సినిమాను చూసే అవకాశముంది. కాబట్టి ఓటీటీ సంస్థలు కూడా ఈ తేదీనే లాక్ చేయనున్నాయని తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం రూమర్లు మాత్రమే. మరికొన్ని రోజులు ఆగితే కల్కి ఓటీటీ రిలీజ్ డేట్ పై ఫుల్ క్లారిటీ రానుంది.కల్కి 2898 ఏడీ చిత్రం మొత్తం రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ వెర్షన్ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. ఇలా నాలుగు భాషల కోసం ఏకంగా రూ. 200 కోట్లు ఖర్చు పెట్టిందట అమెజాన్ ప్రైమ్. మరోవైపు హిందీ వెర్షన్ హక్కు కోసం నెట్‌ఫ్లిక్స్ రూ.175 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. అంటే మొత్తంగా ఓటీటీ రైట్స్ రూపంలోనే సినిమాకి రూ.375 కోట్లు వచ్చినట్లుగా చెబుతున్నారు.ఇక ఈ సినిమాలో ప్రభాస్ పోషించిన భైరవ, సూపర్ కార్ బుజ్జి ప్రధాన పాత్రలుగా రూపొందిన 'బుజ్జి అండ్ భైరవ' వెబ్ సిరీస్ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఎపిసోడ్స్‌ అమెజాన్ ప్రైమ్‌లో వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: