యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ హీరోగా నటించిన హనుమాన్ సినిమా చాలా తక్కువ అంచనాల మధ్య ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైంది.కేవలం 40 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇది చిన్న సినిమా అయినా పెద్ద సినిమాలనే తలదన్ని మరి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇది తెలుగులో ఫస్ట్ సూపర్ హీరో సినిమాగా.. విడుదలైన ఈ సినిమా సీక్వెల్ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్.. పతాకం పై.. ఈ మూవీని నిరంజన్ రెడ్డి అతని భార్య.. చైతన్య రెడ్డి నిర్మించారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని భారీగా డిస్ట్రిబ్యూట్ చేశారు. డిస్ట్రిబ్యూటర్లకు మాత్రమే కాక నిర్మాతలకి కూడా ఈ సినిమా భారీగానే లాభాలని తెచ్చిపెతట్టింది. ప్రస్తుతం చైతన్య రెడ్డి ప్రియదర్శి, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న డార్లింగ్ సినిమా అని నిర్మించడం జరిగింది. ఆ సినిమా ఈవారం విడుదలకి రెడీ అవుతుంది. 


ఇంకా ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా చైతన్య రెడ్డి పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. అందులో ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ మధ్య వస్తున్న పాన్ ఇండియా, భారీ బడ్జెట్ సినిమాల గురించి ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ వేయడం జరిగింది. ఆమె అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమాని తీసేసి.. టికెట్ రేట్లు పెంచేసి. ఆడియన్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి.. అని నాకు లేదు. అలా చేస్తే అందరూ ప్రేక్షకులు థియేటర్లకి రారు. 200 టికెట్ ఉన్నప్పుడు.. 200 మంది సినిమా చూస్తే.. 400 రూపాయలు టికెట్ ఉన్నప్పుడు.. 100 మంది లేదా 50 మంది మాత్రమే చూస్తారు. అందుకే ప్రొడక్షన్ నిర్మాణ విలువలు బాగుండాలి తప్ప బడ్జెట్ అయితే పెరగకూడదు.. అని అన్నారు హనుమాన్ నిర్మాత చైతన్య రెడ్డి. అయితే ఈ మాటలు కల్కి సినిమా గురించే అంటున్నారని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: