తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా , నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో బండ్ల గణేష్ ఒకరు. ఈయన మొదటగా ఆంజనేయులు అనే సినిమాతో నిర్మాతగా కెరియర్ ను మొదలు పెట్టాడు. రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తర్వాత బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో తీన్మార్ మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తీన్మార్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ కావడంతో ఈ నిర్మాతకు పవన్ రెండో ఛాన్స్ ఇచ్చాడు. దానితో ఈయన హిందీ లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన దబాంగ్ మూవీ ని పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేశాడు.

మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా హరీష్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఇకపోతే ఈ సినిమా కంటే ముందు శృతి హాసన్ కు వరుసగా అపజయాలు వచ్చాయి. దానితో ఈమెకు ఐరన్ లెగ్ అనే పేరు కూడా వచ్చింది. మరి ఈ సినిమాలో ఈమెను ఎలా సెలెక్ట్ చేశారు అనే విషయం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు. తాజాగా బండ్ల గణేష్ మాట్లాడుతూ ... దబాంగ్ మూవీ ని పవన్ తో రీమేక్ చేయాలి అనుకున్నప్పుడు అంత సెట్ అయ్యింది. హీరోయిన్ గా శృతి హాసన్ ను ఓకే చేశారు.

నేను ఓ రోజు పవన్ దగ్గరికి వెళ్లి సార్ ఆ అమ్మాయికి వరుసగా ఫ్లాప్ లు ఉన్నాయి. వేరే ఎవరినైనా తీసుకుందాం అని చెప్పాను. దానితో పవన్ కళ్యాణ్ నీకేమైనా పెద్ద హిట్ లు ఉన్నాయా ..? అదంతా ఏం పట్టించుకోకు. సినిమా బాగుంటే ఆడుతుంది. అంతే తప్ప అమ్మాయి వల్ల ఏమీ జరగదు అని చెప్పాడు. నేను దానితో అవును కదా ఆ అమ్మాయితో ఏముంది సినిమా కథ బాగుండాలి కానీ అనుకున్న సైలెంట్ గా వచ్చేసా. అలా పవన్ కళ్యాణ్ ఆ రోజు ఆ మాట అని ఉండకపోతే శృతి హాసన్ సినిమాలో హీరోయిన్ గా ఉండేది కాదు అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: