కల్కి సినిమా చూసిన వారెవరైనా ఇలాంటి విజువల్ వండర్ ని నాగ్ అశ్విన్ ఎంత చక్కగా తెరకెక్కించాడో అని అనుకుంటున్నారు. అఫ్కోర్స్ సినిమాపై కొందరు విమర్శలు చేస్తున్నా ఎక్కువశాతం మంది సినిమా నెక్స్ట్ లెవెల్ అనేస్తున్నారు. సినిమా చూసిన చాలామంది రాబోతున్న భారీ సినిమాలను పోల్చి చూస్తున్నారు. ముఖ్యంగా గ్రాఫిక్స్ ప్రాధాన్యంగా వచ్చే సినిమాల మీద మరింత ఫోకస్ ఉంటుంది.

ఈ క్రమంలో మంచు విష్ణు చేస్తున్న కన్నప్ప సినిమా మీద కల్కి ఎఫెక్ట్ బాగా ఉంటుందనిపిస్తుంది. భక్త కన్నప్ప కథతో ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో మంచు విష్ణు హీరోగానే కాదు నిర్మాతగా కూడా చేస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమాను మంచు విష్ణు కెరీర్ బెస్ట్ గా తెరకెక్కించాలని చూస్తున్నాడు. ఐతే రీసెంట్ గా వచ్చిన టీజర్ లో మంచు విష్ణు యాక్టింగ్ చూసి ట్రోల్స్ వచ్చాయి.

అంతేకాదు గ్రాఫిక్స్ కూడా సీరియల్ లా ఉందని అంటున్నారు. ఐతే కల్కి చూసిన ఆడియన్స్ కచ్చితంగా కన్నప్ప ని కూడా చూస్తారు. ఎందుకంటే సినిమాలో ప్రభాస్ నదీశ్వరుడిగా చేస్తున్నాడు. అక్షయ్ కుమార్ శివుడిగా నటిస్తున్నారు. మరి ఇంత భారీ కాస్టింగ్ తీసుకుని సినిమా గ్రాఫిక్స్ పేలవంగా ఉంటే మాత్రం ఎఫెక్ట్ పడుతుంది. మంచు విష్ణు మాత్రం సినిమా మీద భారీ నమ్మకం తో ఉన్నాడు. మంచు విష్ణు కన్నప్ప సినిమా దసరా రిలీజ్ అనుకుంటున్నారు. మరి సినిమా ఎప్పుడొచ్చినా కల్కి ఎఫెక్ట్ మాత్రం ఉండేలా కనిపిస్తుంది. ఎంత బడ్జెట్ పెట్టామన్నది కాదు ఎంత క్వాలిటీ మెయింటైన్ చేశామన్నది ముఖ్యన్. ప్రశాంత్ వర్మ పాతిక 30 కోట్ల లోనే హనుమాన్ సినిమా చేశాడు. ఆ సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరచింది. మరి ఈ విషయాలన్నిటి మీద మంచు విష్ణు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అన్నది తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: