స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా బ్లాక్ బస్టర్  విజయాన్ని సంపాదించుకుంది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు 900 కోట్లకు పైగానే వసూలు చేసింది. 1000 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. కల్కి నిర్మాతలకి కాసుల వర్షం కురిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే చాలామంది స్టార్ హీరోల రికార్డులను సైతం తిరగరాసింది కల్కి. ఐతే తాజాగా ఈ సినిమాకి  మరో అరుదైన గౌరవం దక్కినట్లుగా తెలుస్తోంది. అదేంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ థియేటర్లో ఈ సినిమా ను ప్రదర్శించబోతున్నట్లుగా సమాచారం వినబడుతుంది. ఇకపోతే  జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా కల్కి 2898 ఏడీ తెలుగు,

 తమిళ్‌, హిందీ,కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఊహించనట్టుగానే సంచలన విజయం అందుకుంది. అన్ని భాషల్లోనూ ఊహించని రెస్సాన్స్‌తో బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. విడుదలై రెండు వారాలు అవుతున్న వరల్డ్‌ వైడ్‌గా 'కల్కి 2898 ఏడీ' అదే జోరు చూపిస్తుంది. ఐతే   'కల్కి 2898 AD' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. సైన్స్ ఫిక్షన్ స్టైల్లో ఈ రూపొందింది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఆలోచన జనాలకు నచ్చింది. ఈ ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శితమవుతోంది. అదే విధంగా, ఈ చిత్రాన్ని జూలై

 13న కాలిఫోర్నియాలోని TCL చైనీస్ థియేటర్‌లో ప్రదర్శించనున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద IMAX స్క్రీన్‌గా ఖ్యాతిని పొందింది. ఈ స్క్రీన్ పొడవు 27 మీటర్లు. ఈ థియేటర్‌లో మొత్తం 932 మంది కూర్చోవచ్చు. ఈ థియేటర్ వెలుపలి భాగం చైనీస్ శైలిలో ఉంటుంది. ఈ థియేటర్ 1927లో ప్రారంభమైంది. అంటే మరి కొన్నేళ్లలో రంగస్థలం 100 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ స్పెషల్ స్క్రీనింగ్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా పాలుపంచుకోనున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: