ఐతే అకిరా నందన్ కి సినిమా హీరోగా అవ్వాలని ఉంటే మాత్రం తమకు ఛాన్స్ ఇవ్వాలని నిర్మాతలు వెంట పడుతున్నారు. అకిరా నందన్ తో సినిమా చేసేందుకు నిర్మాతలు డివివి దానయ్య, ఏ.ఎం రత్నం ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. పవన్ తో అకిరాని తమ ప్రొడక్షన్ లో ఇంట్రడ్యూస్ చేసేలా చర్చలు జరుపుతున్నారట. అకిరా నందన్ ఎంట్రీ కి టైం వచ్చిందని ఫ్యాన్స్ అంతా అతని ఎంట్రీ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారని అంటున్నారు.
అకిరా అటు లవ్ స్టోరీతో పాటుగా మాస్ యాక్షన్ సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. రీసెంట్ గా అకిరా నంద, ప్రేమలు హీరోయిన్ మమితా బైజు ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారు అంటూ ఒక న్యూస్ బయటకు వచ్చింది. ప్రేమలు సినిమాతో సూపర్ పాపులర్ అయిన మమితా యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ప్రేమలు హిట్ అవ్వడంతో ఇప్పుడు ప్రేమలు 2 సినిమా తీస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది. నిర్మాతలు ఓకే కానీ అకిరా నందన్ మొదటి సినిమా ఎవరి డైరెక్షన్ లో ఉంటుంది అన్నది కూడా చర్చల్లో ఉంది.