తమిళ స్టార్ హీరో ధనుష్, రీసెంట్ సినిమా కథల ఎంపిక కొత్తగా ఉంది. ప్రతీ ఒక్కరిని కూడా ఆశ్చర్య పరుస్తోంది. నేటివిటికి దగ్గరగా ఉండి, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలని చేస్తున్నాడు.అసురున్, వాడా చెన్నయ్, కెప్టెన్ మిల్లర్ ఇంకా కర్ణన్ సినిమాలు ఆ కోవలో వచ్చినవే. వేటికవే భిన్నమైన కథ, సహజత్వమైన కథనం ఉండే సినిమాలు. ఇలా విభిన్నమైన సినిమాలతో వరుస హిట్లు కొడుతున్నాడు హీరో ధనుష్.ఇప్పుడు తన కెరీర్‌లో 50వ సినిమా చేస్తున్నాడు ధనుష్. పైగా హీరోగా నటిస్తూనే స్వయంగా దర్శకత్వం వహించింన చిత్రం రాయన్. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌ గ్లిమ్స్ కు ఫ్యాన్స్ నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ సారి మరో కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నట్టు సమాచారం తెలుస్తోంది. 


మూవీ నుండి వచ్చిన మొదటి సింగిల్‌ అయితే సినిమాపై హైప్ మరింత పెంచింది. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు రెడీగా ఉంది రాయన్. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యకమాలు కంప్లిట్ చేసుకొంది. చిన్న చిన్న కట్స్ తో సినిమాకి ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ టీమ్. రక్తపాతం, హింస పాళ్లు కొద్దిగా ఎక్కువగా ఉండడంతో ‘A’ సర్టిఫికెట్ జారీ చేశారు. అందుకే 18 ఏళ్ల లోపు వయసుగలవారికి రాయన్ చూసేందుకు అనుమతి లేదు. ఈనెల 26 వ తేదీన పాన్ ఇండియా భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది రాయన్.రాయన్‌ సినిమాలో ఎస్‌జె సూర్య, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, దుషార విజయన్, అపర్ణ బాలమురళి ఇంకా వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ భారీ మూవీని నిర్మిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీత స్వరకర్తగా పని చేస్తున్నాడు. అలాగే మరోవైపు ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేరుడు అనే స్ట్రయిట్ తెలుగు మూవీని చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: