జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మొదటగా స్టూడెంట్ నెంబర్ 1 అనే మూవీ రూపొందింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇక వీరి కాంబినేషన్ లో రెండవ సినిమాగా సింహాద్రి తెరకెక్కింది. ఈ మూవీ లో భూమిక , అంకిత హీరోయిన్ లుగా నటించగా ... నాజర్ , కోట శ్రీనివాసరావు , బ్రహ్మానందం ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. విజయేంద్ర ప్రసాద్ కథను అందించిన ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమా 2003 వ సంవత్సరం జూలై 9 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయింది.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే 21 సంవత్సరాలు అవుతుంది. ఇకపోతే ఈ సినిమా ఆ సమయంలో ఎన్నో రికార్డులను నెలకొల్పింది. 21 సంవత్సరాలు అయినా కూడా కొన్ని రికార్డులు ఇప్పటికీ కూడా సింహాద్రి మూవీ పేరు మీదే ఉన్నాయి. అలాంటి ఒక రికార్డు గురించి మనం తెలుసుకుందాం. ఈ మూవీ 51 సెంటర్ లలో 175 డేస్ ఆడింది. ఇక ఈ సినిమా తర్వాత ఏ సినిమా కూడా ఇన్ని సెంటర్ లలో ఇన్ని రోజులు ప్రదర్శించబడలేదు.

మూవీ కంటే ముందు ఈ రికార్డు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఇంద్ర సినిమాపై ఉంది. చిరు హీరోగా రూపొందిన ఇంద్ర మూవీ 175 రోజులను 31 డైరెక్ట్ సెంటర్స్ లో జరుపుకోగా ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన సింహాద్రి 52 డైరెక్ట్ సెంటర్స్ లో చరిత్ర సృష్టించింది. ఇకపోతే ఈ సినిమాకి ఆ సమయంలో 12.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 26.50 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి డబల్ ప్రాఫిట్ లను మించి లాభాలను అందుకొని అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: