తమిళ నటుడు కార్తీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ఈయన అనేక విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా విడుదల అయ్యాయి. ఈయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో విడుదల  అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా అందుకున్నాయి. కార్తీ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో మంచి విజయాలను సాధించడంతో కార్తీ కి తెలుగు లో కూడా మంచి గుర్తింపు ఉంది.

ఇది ఇలా ఉంటే కార్తీ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలలో ఖైదీ మూవీ ఒకటి. ఈ మూవీ కి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల అద్భుతమైన విజయాన్ని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అందుకుంది. ఈ సినిమా చివరలో ఈ మూవీ కి కొనసాగింపుగా ఖైదీ 2 ఉండబోతున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. దానితో ఖైదీ 2 ఎప్పుడు వస్తుందా అని కార్తీ అభిమానులతో పాటు , ఖైదీ మూవీ అభిమానులు కూడా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే తాజాగా ఓ ఈవెంట్ లో భాగంగా కార్తీ ఈ సినిమా సీక్వెల్ గురించి ప్రకటించాడు.

ప్రస్తుతం లోకేష్ వేరే సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ మూవీ ల షూటింగ్స్ త్వరలోనే పూర్తి కాబోతున్నాయి. వచ్చే సంవత్సరం ఖైదీ 2 మూవీ స్టార్ట్ అవుతుంది అని తెలియజేశాడు. అలాగే బిర్యానీ బకెట్ పెట్టుకొని రావలసిన సమయం వచ్చేసింది అంటూ ఈ సినిమా గురించి అప్డేట్ ఇచ్చాడు. ఇది ఇలా ఉంటే కార్తీ ఆఖరుగా జపాన్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: