ప్రభాస్ హీరోగా నటించిన తాజా సినిమా కల్కి సినిమా డూపర్ హిట్ టాక్ తో థియేటర్స్ లో బాగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ చూసి దర్శకుడిని అందరూ కూడా ఎంతగానో అభినందిస్తున్నారు.. ఈ సినిమా మొదటి షో నుంచి ఇప్పటి దాకా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా బాగానే వసూళ్లు చేస్తూ వస్తుంది.. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 191 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. రెండు రోజుల్లో 298 కోట్లు వసూలు చేసి మూడు రోజుల్లో ఏకంగా 415 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.. మొత్తంగా చూసుకుంటే రెండువారాలకు గాను ఈ సినిమా మొత్తం రూ. 990 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.అయితే ఈ సినిమా ఏకంగా 1500 కోట్ల భారీ టార్గెట్ పెట్టుకొని బరిలో దిగిన నాలుగు రోజుల్లోనే సగం కలెక్షన్స్ ను సాధించింది.


సినిమా విడుదల సమయంలో ఎలాంటి సినిమాలు లేకపోవడంతో ఈ సినిమా కలెక్షన్స్ బాగానే రాబడుతుంది.. ఇంకా అలాగే మరో రెండు రోజుల పాటు తెలుగులో ఏ సినిమా లేకపోవడం, బాలీవుడ్ లో కూడా చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో కల్కి సినిమాకి ఈ వారం కూడా బాగానే కలిసొస్తుంది. వారం రోజుల్లో ఈజీగా 1000 కోట్ల వసూళ్ళని దాటేస్తుందని అంచనా వేశారు.. కానీ కేవలం అడుగు దూరంలో ఆగిపోయింది.. సినిమా రిలీజ్ కు ముందు ఈ సినిమా పక్కాగా 1500 కోట్లకు పైగా రాబడుతుందని ప్రొడ్యూసర్ అశ్వినిదత్ చెప్పిన సంగతి తెలిసిందే.అమెరికాలో అయితే అన్ని రికార్దులని చాలా ఈజీగా బ్రేక్ చేస్తూ కలెక్షన్స్ రాబడుతుంది కల్కి. ఇప్పటికే కల్కి సినిమా అక్కడ 20 మిలియన్ డాలర్స్ రాబట్టింది. అంటే మన లెక్కల్లో దాదాపు 83 కోట్లు రాబట్టింది. ఇలా పలుచోట్ల కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డులు సెట్ చేస్తుంది కల్కి 2898AD సినిమా.. అయితే లాంగ్ రన్లో మాత్రం త్రిపుల్ ఆర్ రికార్డులను బ్రేక్ చేసేలా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: