తెలుగు సినీ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గా పేరు పొందిన మోహన్ బాబు ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తిత్వం కలిగిన హీరోగా పేరు సంపాదించారు.. ముఖ్యంగా నందమూరి కుటుంబం అంటే చాలా అభిమానం ఉన్నది..సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి చాలామంది హీరోలతో కలిసి పని చేశారు మోహన్ బాబు. అలాగే బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తో కూడా కలిసి పనిచేయడం జరిగింది. యమదొంగ చిత్రంలో మోహన్ బాబు యముడి పాత్రలో అద్భుతంగా నటించారు.


ఈ పాత్రలో మోహన్ బాబుని రాజమౌళి సూచించింది ఎవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ అనేట ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ స్వయంగా వెల్లడించారు. యమదొంగ చిత్రానికి జరిగిన డిస్కషన్లు రాజమౌళి ఒక టైటిల్ చెబుతాను ఎలా ఉందో అని అడిగారని ఆ సమయంలో రాజమౌళి యమదొంగ అని పెట్టారని తెలిపారు ఎన్టీఆర్.. యమగోల తరహాలో మనం ఒక చిత్రం అనుకున్నాము కానీ తనకు ఎందుకో చిన్నపాటి భయం కలిగింది.అందుకే సినిమా స్క్రిప్టును టైటిల్ ని కొంచెం మార్చాను అంటూ తెలిపారట.

ఆ సమయంలోనే యముడిగా ఎవరైతే బాగుంటుంది అని ఎన్టీఆర్ ని సలహా అడిగారట రాజమౌళి. ఆ పాత్రలో నటించే ఏకైక మొగాడు మాత్రం మోహన్ బాబుని అని చెప్పారట.. అయితే ఆయన చేస్తారో లేదో తెలియదు కానీ రాజమౌళి అడిగినందుకు ఈ సమాధానం చెప్పారట ఎన్టీఆర్.. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆలోచించి ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ వెళ్లి స్వయంగా వెళ్లి మాట్లాడుతానని రాజమౌళికి మాట ఇచ్చారట.రాజమౌళి చెప్పగానే మొదట మోహన్ బాబు కాస్త పాజిటివ్ అని రియాక్ట్ అయిన.. నువ్వు డైరెక్షన్ గా,ఎన్టీఆర్ హీరో కాబట్టి ఈ సినిమాని చేస్తున్నానని తెలిపారట. ఈ సినిమా ఆడియో వేడుకలలో కూడా మోహన్ బాబు మాట్లాడడం జరిగింది. అన్నగారి ఆశీస్సులు ఉన్నంతవరకు తారక్ ని ఎవరు ఏమి చేయలేరంటూ కూడా ఉద్దేశించి తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: