తెలుగులో అత్యంత క్రేజ్ కలిగిన దర్శకులలో కొరటాల శివ ఒకరు. ఈయన మిర్చి మూవీ తో కెరీర్ ను మొదలు పెట్టి మొదటి ఆ మూవీతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను సినిమాలతో విజయాలను అందుకని ఆ ఫామ్ ను అలాగే కంటిన్యూ చేస్తూ తెలుగులో టాప్ దర్శకుడి స్థాయికి వెళ్ళాడు. ఇలా కెరియర్ ను అద్భుతమైన జోష్ లో ముందుకు సాగిస్తున్న సమయంలో కొరటాల మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే కొరటాల , ఎన్టీఆర్ తో మూవీ కమిట్ అయ్యాడు. ఇక ఇటు చూస్తే ఆచార్య భారీ అపజయాన్ని అందుకుంది.

అటు చూస్తే ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దానితో ఎన్టీఆర్ , కొరటాలకు సినిమా అవకాశం ఇవ్వడు అని చాలా మంది అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇచ్చిన మాట ప్రకారం కొరటాల కు తన నెక్స్ట్ సినిమా అవకాశాన్ని ఇచ్చాడు. ఇకపోతే ఆచార్య కు జరిగిన తప్పు ఎన్టీఆర్ మూవీ తో జరగకూడదు అని ఈయన చాలా రోజులు ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులను చేశాడు. దానితో ఎంతకు ఈ సినిమా స్టార్ట్ కాకపోవడంతో చాలా మంది ఎన్టీఆర్ అభిమానులు అసలు ఈ సినిమా ఉంటుందా... ఉండదా అని కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశాక మాత్రం కొరటాల జెట్ స్పీడ్ గా ఈ మూవీ ని పూర్తి చేస్తూ వస్తున్నాడు.

మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ సినిమా మొదటి భాగాన్ని కొన్ని రోజుల క్రితం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ అంతకు చాలా రోజుల ముందే ఈ సినిమా యొక్క మొదటి భాగం పనులు పూర్తి అయ్యే ఛాన్స్ ఉండడంతో ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక కొరటాల ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు. అందుకే ఈ సినిమా విడుదల తేదీని కూడా ముందుకు తీసుకువచ్చాడు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. అలాగే ముందు ఈ సినిమా స్టార్ట్ చేయడానికి కాస్త టైమ్ తీసుకున్న , ఆ తర్వాత ఫుల్ స్పీడ్ గా ఈ సినిమాను పూర్తి చేస్తున్నందుకు చాలా మంది ఆయనను మెచ్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: