టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పేరు గత కొద్ది రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తోంది.. అందుకు కారణం తన ప్రేయసి లావణ్య పోలీస్ స్టేషన్లోకి వెళ్లి మరి రాజ్ తరుణ్ మోసం చేశారని పెళ్లి చేసుకోలేదని ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా రాజ్ తరుణ్ పేరు పాపులారిటీ అందుకున్నది. అలాగే హీరోయిన్ మాల్వి మల్హోత్రా పై కూడా కేసు పెట్టడంతో ఈ విషయం మరింత దుమారాన్ని రేపింది. అంతేకాకుండా హీరోయిన్ మాల్వి మల్హోత్రా కూడా లావణ్య తన తమ్ముడిని తనని తన కుటుంబాన్ని బెదిరిస్తోంది అంటూ కూడా మరొక కేసు పెట్టింది మాల్వి మల్హోత్రా .


ఇలాంటి సమయంలోనే రాజు తరుణ్ తో తనకు ఉన్న సంబంధం పైన కూడా లావణ్య పలు కీలకమైన అంశాలను కూడా వెల్లడించింది. గడిచిన 10 సంవత్సరాల నుంచి రాజు తరుణ్ నేను కాపురం చేస్తున్నామంటూ లావణ్య తెలియజేసింది. ఈ విషయం విన్న అభిమానులు సైతం ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అంతేకాకుండా మరొక ట్విస్ట్ ఏమిటంటే గడచిన కొద్ది రోజుల క్రితం రాజు తరుణ్ తనకు అబార్షన్ చేయించారని కూడా చెప్పింది. ఇందుకు సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్ కూడా తన దగ్గర ఉన్నాయని తెలియజేసింది. ఈ విషయం అటు అభిమానులను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.


రాజ్ తరుణ్ చేసిన ప్రతి పని కూడా లావణ్య పేరుతో కాకుండా అన్విక అనే పేరుతోనే అన్ని పనులు కలిసే చేశామని తెలియజేసింది. అదే పేరుతో కూడా విదేశాలకు వెళ్లొచ్చామంటూ పలు విషయాలను రివిల్ చేసింది లావణ్య. కానీ రాజ్ తరుణ్ జీవితంలోకి మాల్వి వచ్చిన తర్వాత తనని దూరం పెట్టారని అందుకే తను రాజ్ తరుణ్ మీద కేసు పెట్టానని కూడా తెలియజేసింది. రాజ్ తరుణ్, మాల్దీ మల్హోత్ర ప్రస్తుతం తిరగబడరా సామి అనే సినిమాలో నటించారు. తామిద్దరి మధ్య ఉండే బంధాన్ని కూడా అటు రాజు తరుణ్ ఇటు మాల్వి వివరించినప్పటికీ లావణ్య మాత్రం పలు రకాల ఆరోపణలు చేస్తూనే ఉంది..

అలాగే రాజ్ తరుణ్ పైన నార్సింగ్ పోలీస్స్టేషన్లో కూడా కేసు నమోదు అయినట్లు సమాచారం.. లావణ్య కు అభాసం చేయించాడని లావణ్య తన మెడికల్ రిపోర్టులతో పాటు.. 170 ఫోటోలు టెక్నికల్ ఎవిడెన్స్ ని కూడా పోలీసులకు సైతం అందజేసినట్లు తెలుస్తోంది. ఎంత హీరో రాజ్ తరుణ్ పైన ఐపిసి 493 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మరి వీటిపైన రాజ్ తరుణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: