గత కొన్ని రోజులుగా శాండిల్ వుడ్లో హీరో దర్శన్ గురించే అనేక కధనాలు కధలు కధలుగా వినబడుతున్నాయి. దానికి కారణం అందరికీ తెలిసినదే. అభిమానిని హత్యా ఆరోప‌ణ‌ల కేసులో దర్శన్ జైలు పాలు కావడం తెలిసిందే. ఈ క్రమంలోనే బెంగళూరులోని సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో పెట్టారు మన హీరోని. కాగా అక్కడ తిండి తినలేక అజీర్తితో బాధ‌ప‌డుతున్నాన‌ని ఆయన తాజాగా అక్కడి అధికారులకు విన్నవించుకున్నట్టు తెలిపాడు. అక్కడ జైలులో తనకు పెట్టిన తిండి అస్సలు తినబుద్ది కావడం లేదని, ఒకవేళ తిన్నప్పటికీ అది అరగడం లేదంటూ వాపోయాడు. అంతేకాకుండా ఈమధ్య కాలంలో తాను డయేరియాకి కూడా గురైనట్టు చెప్పాడు. దాంతోనే చాలా బరువు తగ్గినట్టు వాపోయాడు.

ఈ నేపథ్యంలోనే ద‌ర్శ‌న్ జైలు సూపరింటెండెంట్‌కు దిశానిర్దేశం చేస్తూ హైకోర్టుకి విన్నవించుకున్నాడు. ఆ విన్నపంలో తనకి ప్రైవేట్‌గా ఇంటి భోజనం, దుస్తులు, పరుపులు, పుస్తకాలను యాక్సెస్ చేయడానికి అనుమతించాలని కోరడం జరిగింది. కాగా కోర్టు ఉత్తర్వుతో ప‌ని లేనందున అతడికి ఇంటి ఆహారాన్ని అందించడానికి అయితే అనుమతించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే కర్ణాటక జైళ్ల చట్టంలోని సెక్షన్ 30 (IGP (జైళ్లు) ద్వారా) అండర్ ట్రయల్ ఖైదీలు ఆరోగ్యం దృష్ట్యా సరైన ఆహారం, దుస్తులు వంటివి కొనుగోలు చేయడానికి లేదా ఇతరులనుండి స్వీకరించుకోవడానికి కోర్టు అనుమతిస్తుంది. ఈ సెక్షన్ నే దర్శన్ వాడుకోవాలని చూస్తున్నాడు.

ఇకపోతే ఈ కేసులోకి తనని అన్యాయంగా లాగారని, అందువల్ల సాధారణ బెయిల్ మంజూరుకు సంబంధించి తన న్యాయవాదుల నుండి న్యాయ సహాయం పొందే పనిలో ఉన్నట్టు ఆయన తాజాగా ఓ మీడియాకు చెప్పుకొచ్చారు. కాగా ఆయన పిటిషన్ బుధవారం కోర్టు ముందుకు రానుంది. కాగా ఈ కేసులో ద‌ర్శ‌న్ ప్రియురాలు ప‌విత్ర ఏ1 గా కాగా, ద‌ర్శ‌న్ ఏ2 గా ఉన్నారు. వీరితో పాటు మ‌రో 16 మందిని అరెస్ట్ చేసి ప్రస్తుతం పోలీసులు వారినుండి మరింత సమాచారాన్ని రాబట్టే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రియురాలు పవిత్ర‌కు అస‌భ్యక‌ర‌మైన మెసేజ్ లు పంప‌డం వ‌ల్ల‌నే ద‌ర్శ‌న్ ఈ హ‌త్య చేయించాడ‌ని పోలీసులు త‌మ క‌థ‌నంలో పేర్కొన్న సంగ‌తి అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: