తెలుగు సినిమా కథ రూపురేఖల్లో ఎన్ని మార్పులు వచ్చినా నేటికీ తెలుగు నేటివిటితో సినిమాలు తీసే హీరో నందమూరి బాలకృష్ణ. రికార్డులకి రారాజుగా కూడా అయన అభిమానులు పిలుచుకుంటుంటారు. తెలుగు సినిమా పరిశ్రమలో బాలయ్య సృష్టించిన ఎన్నో రికార్డులు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇప్పుడు బాలకృష్ణ సినిమాకి సంబంధించిన ఒక తాజా వార్త ఫిల్మ్ నగర్ లో టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ళు పూర్తి చేసుకోనున్నారు.అలాంటి రేర్ రికార్డు బాలయ్యకే సొంతం.. అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తూ ఎప్పుడూ ముందంజలో ఉంటారు. అదేవిధంగా బసవతారకం హాస్పిటల్ తో బిజీగా ఉండి కూడా ఎంతోమందికి సేవలందిస్తూ సేవా కార్యక్రమాలలో ముందుంటారు. ఇటీవల వరస మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో హ్యాట్రిక్ హీరోగా నిలబడ్డారు. అంతేకాకుండా హిందూపూర్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యే గా అత్యధిక మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ లీడర్ అనిపించుకున్నారు అదేవిధంగా ప్రజలకు ఎన్నో విధాలుగా ఎంతో సేవ చేస్తున్నారు.అగ్రహీరో బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ‘ఎన్‌బీకే 109’ వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘వీరమాస్‌’ అనే టైటిల్‌ అనుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.ఇదిలావుంటే బాలయ్య వచ్చే నెలలో నటుడిగా 50ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఆయన తొలి చిత్రం ‘తాతమ్మకల’ విడుదలై వచ్చే నెల 30 నాటికి అక్షరాలా 50ఏళ్లు.ఒక హీరో వారసుడిగా తెరంగేట్రం చేసి, ఇన్నేళ్లుగా కెరీర్‌ కొనసాగిస్తూ, ఇప్పటికీ స్టార్‌హీరోగా చెలామణీ కావడం బాలకృష్ణకు మాత్రమే సాధ్యమైంది. ఓ విధంగా ఇది దేశంలోనే రికార్డ్‌. మొత్తానికి అన్ని విధాలుగా విజయవంతమైన కెరీర్‌ని కొనసాగిస్తున్నారు నందమూరి బాలకృష్ణ.ఆయన తనయుడు, నటవారసుడు మోక్షజ్ఞ కూడా ఈ ఏడాదే హీరోగా పరిచయం కానుండటం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: