ముఖ్యంగా కరోనా సమయంలో ఎంతో మందికి సాయం అందించాడు విజయ్. అదే విధంగా ఖుషి సినిమా రిలీజ్ సమయంలో 100 పేద కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున మొత్తం కోటీ రూపాయలు పంచి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇలా ఇబ్బందుల్లో ఉన్న తన ఫ్యాన్స్ కు, ప్రజలకు తన వంతు సాయం చేస్తూనే ఉంటాడు మన రౌడీ బాయ్. ఈ క్రమంలో విజయ్ దేవర కొండ గొప్ప మనసు గురించి చెబుతూ ఓ ట్రాన్స్ జెండర్ ఎమోషనల్ కావడం ఇపుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ ను దేవుడితో పోల్చుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఒక ట్రాన్స్‌జెండర్ వీడియోలో మాట్లాడుతూ... మీకు థ్యాంక్స్ చెప్పాలని గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా. ఈరోజు నాకు అవకాశం దక్కింది. మాకు భిక్షాటనే జీవనాధారం. లాక్‌డౌన్ కారణంగా అంతా ఇంటికే పరిమితం కావలసి వచ్చింది. ఆ సమయంలో మమ్మల్ని కష్టాలు చుట్టుముట్టాయి. నేను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాను. అదే టైంలో గూగుల్ విజయ్ ఫౌండేషన్ కనిపించింది. అది క్లిక్ చేసి సాయం కావాలని దరఖాస్తు ఫిల్ చేశాను. అది చేసిన 16 నిమిషాల్లోనే మీ ఫౌండేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఒక్క నాకే కాదు నాలాంటి 18 మంది ట్రాన్స్ జెండర్లకు మీరు సాయం చేయడం నేను జీవితంలో మర్చిపోలేను. అప్పుడు నాకు నిజంగా అనిపింది.. దేవుడు ఎక్కడో లేడు. మీలోనే ఉన్నారు అంటూ ట్రాన్స్ జెండర్ కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ కావడంతో విజయ్ దేవరకొండ చేసిన మంచి పనిపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.