టాప్ హీరోయిన్ అనుష్క.. చాలా తక్కువ సమయంలోనే స్టార్డమ్‌ సంపాదించుకుంది.అరుంధతి లాంటి పవర్ ఫుల్ లేడీ ఓరియంటెడ్ సినిమాతో హీరోలతో సమానంగా క్రేజ్ సొంతం చేసుకుంది అనుష్క. 2018 వ సంవత్సరం తర్వాత సినిమాలు చేయడంలో జోరు తగ్గించిన అనుష్క.. ప్రస్తుతం మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ కొత్త ప్రాజెక్ట్‌లను లైన్ లో పెడుతూ తన బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తుంది.అయితే ఈ సంగతి పక్కన పెడితే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో అనుష్క తన కెరీర్ లో బెస్ట్ అండ్ వరస్ట్ సినిమాల గురించి మాట్లాడింది. తాను నటించిన చిత్రాల్లో వేదం ఇంకా అరుంధతి చిత్రాలంటే తనకు చాలా ఇష్టమని అనుష్క పేర్కొంది. ఆ సినిమాల్లో నా క్యారెక్టర్స్ ప్రేక్షకులకు చాలా బాగా కనెక్ట్ అయ్యాయని చెప్పుకొచ్చింది. అలాగే తన కెరీర్ మొత్తంలో అత్యంత చెత్త మూవీ ఒక్క మగాడు అని.. ఆ సినిమా తనకు అస్సలు నచ్చదని అనుష్క సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.


2008 వ సంవత్సరంలో ఒక్క మగాడు సినిమా విడుదలైంది. వై.వి.ఎస్.చౌదరి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా చేశారు. ఆయనకు జోడిగా అనుష్క శెట్టి, సిమ్రాన్ ఇంకా విషా కొఠారి హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒక్క మగాడు సినిమా తొలి ఆట నుంచి నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కథ శంకర్ తీసిన భారతీయుడు సినిమాకు దాదాపు కాపీ అని చాలా రకాల విమర్శలు వచ్చాయి.ఇంకా అలాగే సర్దార్ పాపారాయుడు సినిమా అంశం కూడా కొంత ఉందని అప్పట్లో ప్రేక్షకులు పెదవి విరిచడం జరిగింది. ఇందులో హాస్యం గానీ, పాటలు కానీ మరీ దారుణంగా ఉన్నాయనే కామెంట్స్ వచ్చాయి. బాలకృష్ణ, అనుష్క పెయిర్ కూడా అస్సలు సెట్ అవ్వలేదనే టాక్ వచ్చింది. దాంతో ఒక్క మగాడు సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకొని డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఒక్క మగాడు సినిమా తర్వాత అనుష్క మళ్లీ బాలయ్యతో మళ్ళీ జతకట్టలేదు. ఇదే వారి మొదటి సినిమా ఇంకా ఆఖరి చిత్రం కూడా కావొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: