జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తనకి నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో మోడల్ గా తన కెరీయర్ని ప్రారంభించిన ఆమె ఆ తర్వాత బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం బుల్లితెరపై వరుస షోస్ చేస్తూ దూసుకుపోతోంది. కేవలం షోస్ మాత్రమే కాకుండా అభిషేకం అనే సీరియల్ లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత కూడా పలు సీరియల్స్ తో మెప్పించింది. తూర్పు పడమర ప్రేమ ఎంత మధురం వంటి సీరియల్స్ లో నటించి భారీ సంపాదించుకుంది. అలా మంచి క్రేజ్ సంపాదించుకున్న వర్ష జబర్దస్త్ లో మాత్రం దుమ్ము దులుపుతోంది. ఇందులో తన అద్భుతమైన కామెడీ టైమింగ్ కు

  పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఆన్ స్క్రీన్ లో ఇమాన్యుయల్ తో ఆమె చేసే రొమాన్స్ ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు అని జబర్దస్త్ వేదికగా చాలాసార్లు చెప్పినప్పటికీ అదంతా కేవలం షో టి ఆర్ పి కోసమే అని తెలుస్తుంది. అయితే తాజాగా జబర్దస్త్ షో కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇక ఆ ప్రేమలో వర్ష చేసిన పనికి అందరూ నోరెళ్ళ పెడుతున్నారు. ఆమె ఓ భూస్వామికి లొంగిపోవడం ఆశ్చర్యంగా మారింది. భూమి ఇస్తానంటే భార్యగా నటించేందుకు రెడీ అయ్యింది. కానీ తీరా శోభనం అని తెలియడంతో షాక్‌ తినాల్సి వచ్చింది.

 రియాజ్‌ భార్య వర్షకి లైనేస్తున్నాడు పక్కింటి అజార్‌. దీంతో ఈ విషయాన్ని గమనించిన వర్ష.. తన భర్త రియాజ్‌కి చెప్పింది. అతను అజార్‌ పై గొడవకు వెళ్లాడు. నా భార్యని ఎందుకు చూస్తున్నావని ప్రశ్నించగా, మా నాన్నకి వంద ఎకరాలుంది. నాకు ఇక్కడ భార్య, కొడుకు ఉన్నాడని అబద్దం చెప్పాను, కానీ ఇప్పుడు చూడ్డానికి నాన్న వస్తున్నాడు, భార్యగా నటించేందుకు ఎవరూ రావడం లేదు. 20ఎకరాలు రాసిస్తా అని చెప్పినా ఎవరూ ముందుకు రావడం లేదంటూ వాపోయాడు అజార్‌. రియాజ్‌ కి అదిరిపోయే ప్లాన్‌ వచ్చింది. ఇరవై ఎకరాలంటే మామూలు కాదు, ఒకరోజు అజార్‌కి భార్యగా నటించమి తన భార్య వర్షకి చెబుతాడు. ఇరవైఎకరాల కోసం ఒక రోజున అజార్ కి భార్యగా నటించేందుకు వెళ్తుంది వర్ష...!!

మరింత సమాచారం తెలుసుకోండి: