చాలా ఏళ్ల నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలో డబ్బింగ్ సినిమాల హవా కనిపిస్తూనే ఉన్నది.. ముఖ్యంగా కోలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలు తెలుగులో డబ్బింగ్ చేసి మరి విడుదల చేస్తూ ఉన్నారు. అలా విడుదల చేసిన సినిమాలకు కూడా తెలుగు ఇండస్ట్రీలో మంచి మార్కెట్ సంపాదించుకున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారు. కమల్ హాసన్, రజనీకాంత్, అజిత్, విశాల్, సూర్య తదితర హీరోలు తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకున్నారు. కొన్నిసార్లు వారి సినిమాలు తమిళంలో కంటే తెలుగులోనే మంచి విజయాలను అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయట.


అంతేకాకుండా కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి కూడా  చాలా సినిమాలు విడుదలై మంచి విజయాలు అందుకోవటంతో బిజినెస్ పరంగా కూడా తెలుగులో బాగానే చేస్తున్నాయి అలా తెలుగు వర్షన్లు ఇప్పటివరకు బిజినెస్ భారీగా అందుకున్న సినిమాల జాబితాలను చూసుకుంటే.. కేజిఎఫ్ హీరో నటించిన kgf చాప్టర్-2 సినిమా మాత్రమే ఉన్నదట. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 78 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.కలెక్షన్స్ కూడా ఆ స్థాయిలోనే రాబట్టింది. ఇక రజనీకాంత్ నటించిన రోబో 2.o సినిమా 71 కోట్లు బిజినెస్ రాబట్టింది.


ఇక ఆ తర్వాత స్థానం విక్రమ్ నటించిన ఐ సినిమా 39 కోట్లతో మూడవ స్థానంలో ఉన్నది.. రజనీకాంత్ డైరెక్టర్ పా రంజిత్ కాంబినేషన్లో వచ్చిన కాలా సినిమా 33 కోట్లు బిజినెస్ చేసిందట.. ఇక వీరి కాంబినేషన్లో వచ్చిన కాబాలి సినిమా 31 కోట్లు ఫ్రీ రిలీజ్ బిజినెస్ ని చేసింది.. రోబో 27 కోట్లు.. కమలహాసన్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు-2 సినిమా 25 కోట్ల వరకు తెలుగులో బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది.సూర్య నటించిన సింగం-3 సినిమా 20 కోట్లు.. ఉన్నవి. ముఖ్యంగా రజనీకాంత్ సినిమాలే ఎక్కువగా 20 కోట్లకు పైగా రెండు తెలుగు రాష్ట్రాలలో బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: