డైరెక్టర్ కృష్ణవంశీ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు ఇప్పుడంటే కృష్ణవంశీ పెద్దగా సినిమాలు తీయడం లేదు. అప్పుడో ఇప్పుడో ఏదో ఒక సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన అవి పెద్ద హిట్ కావడం లేదు. కానీ ఒకప్పుడు కృష్ణవంశీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా కొనసాగారు. ఆయన డైరెక్షన్లో ఏదైనా సినిమా వస్తుందంటే అది రికార్డులు తిరగ రాయడం ఖాయమని అభిమానులు కూడా బలంగా నమ్మేవారు. నిన్నే పెళ్ళాడుతా, గులాబీ చంద్రలేఖ, అంతఃపురం, సింధూరం, సముద్రం, మురారి, ఖడ్గం, చందమామ మహాత్మా, రాఖీ,లాంటి ఎంతో అద్భుతమైన సినిమాలు తీయడం కేవలం కృష్ణవంశీకే సాధ్యమైంది.


 అయితే స్టార్స్ తో సినిమాలు తీయడమే కాదు కొత్తవారికి కూడా ఛాన్సులు ఇచ్చి ఎంతోమంది స్టార్లుగా మార్చాడు కృష్ణవంశీ. అద్భుతమైన పాత్రలను క్రియేట్ చేయడంలోనూ ఆయన మాస్టర్ అని చెప్పొచ్చు. ఇక ఆయన సినిమాల్లో పాటలు ఎలా ఉంటాయో ప్రేక్షకులు ప్రతి ఒక్కరు చెప్పేస్తుంటారు. కాగా ఇప్పుడు వరకు ఇండస్ట్రీలో స్టార్లుగా కొనసాగుతున్న ఎంతోమంది ఒకప్పుడు కృష్ణవంశీ దర్శకత్వంలో ఇండస్ట్రీకి పరిచయమైన వారే. అలాంటి వారిలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒకరు అని చెప్పాలి. వీళ్ళు మాత్రమే కాకుండా ప్రస్తుతం స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న సుబ్బరాజు కూడా ఒకరు.


 ఇక ఎంతోమంది హీరోలను ఢీకొట్టే విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సుబ్బరాజుకు తొలి అవకాశం ఇచ్చింది కృష్ణవంశీనే. అప్పట్లో ఎంసీఏ కంప్లీట్ చేసి డెల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేసేవాడు సుబ్బరాజు. అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి మంచి జీతం వస్తున్న ఆయనకు మాత్రం సినిమాలపై ఆసక్తి ఉండేది. అయితే ఓసారి కృష్ణవంశీ పర్సనల్ కంప్యూటర్ కి ఏదో ఇష్యూ వస్తే సుబ్బరాజు బాగు చేయడానికి వెళ్ళాడట. ఆ సందర్భంలో సుబ్బరాజును చూసిన కృష్ణవంశీ.. ఏకంగా ఆయనకు సినిమాలపై ఆసక్తి ఉంది అని తెలుసుకొని.. తదుపరి మూవీ ఖడ్గంలో చిన్న టెర్రరిస్ట్ పాత్ర ఇచ్చారు. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన సుబ్బరాజు.. ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. పూరి జగన్నాథ్  దర్శకత్వంలో వచ్చిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో నెగటివ్ రోల్ చేయగా ఆ పాత్రతో అతని కెరియర్ పూర్తిగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: