భారతీయుడు సినిమా విడుదలైన 25 ఏళ్లకి.. సీక్వెల్‌గా భారతీయుడు-2 సినిమా వస్తోంది. ఈనెల 12న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. కానీ అంతకన్న ముందు కోర్టు నోటీసులు మూవీ యూనిట్‌ను కంగారుపెడుతున్నాయి. కారణం.. సినిమాను నిలిపివేయాలని రాజేంద్రన్‌ కోర్టుకెళ్లడమే. మర్మకళకు సంబంధించిన సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారాయన. దీంతో అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్నది కమల్ ఫ్యాన్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా 1996లో వచ్చిన భారతీయుడు సినిమా సంచలన నిజయాన్ని అందుకుంది. ఇందులో కమల్ హాసన్ డ్యుయెల్ రోల్ చేసి మెప్పించారు. తండ్రి సేనాపతి పాత్రలో కమల్‌ నటన, హావభావాలు ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. భారతీయుడు-2లోనూ కమల్ అంతకుమించి అనేలా రోల్ చేస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కింది. సీక్వెల్‌ ను ప్రకటించగానే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే మొదటి నుంచి ఈ సినిమా వివాదాలు చుట్టుముట్టాయి.ముందుగా లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చింది. మొదట్లో బాగానే ఉన్నా..  బడ్జెట్ విషయంలో నిర్మాతలు – డైరెక్టర్‌ శంకర్ మధ్య గొడవలు జరిగాయి. దీంతో శంకర్ మీద కేసు పెట్టారు. చాలాకాలంపాటు కోర్టులో నలిగింది. కేసు నుంచి శంకర్ బయటపడ్డాక.. కమల్ విక్రమ్‌ షూటింగ్ కారణంగా భారతీయుడు 2 ఆలస్యమైంది.

2020లో సెట్లో ప్రమాదం జరగడం, నలుగురు చనిపోవడం, కరోనా లాక్ డౌన్,  దర్శకనిర్మాతల మధ్య వివాదాలతో సినిమా షూటింగ్ చాలా రోజులు నిలిచిపోయింది. ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన ఈ మూవీ వేర్వేరు కారణాలతో చిత్రీకరణ ఆగిపోవడం ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసింది.ఎన్నోసార్లు వాయిదాపడిన తర్వాత ఫైనల్‌గా జులై 12న విడుదలకు సిద్ధమయ్యింది భారతీయుడు-2. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ఈ మధ్యే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు మేకర్స్. అయితే ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా కోర్టును ఆశ్రయించారు రాజేంద్రన్‌. పార్ట్‌ 1లో మర్మకళకు సంబంధించిన సీన్లలో కీలకంగా వ్యవహరించిన ఆయన.. పార్ట్‌-2కి వచ్చేసరికి మాత్రం రివర్స్ అయిపోయాడు. ఎందుకంటే.. ఆయనకు సంబంధం లేకుండా మర్మకళకు సంబంధించి అంశాలను వాడుకున్నారట. ఈ విషయంలో అసంతృప్తితో ఉన్న రాజేంద్రన్‌ కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది.ఇక ఈ మూవీలో సిద్ధార్థ్‌, కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా భవానీ శంకర్‌, ఎస్‌జే సూర్యా, బాబీ సింహా కీలకపాత్రలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: