అవును, తెలుగు ప్రేక్షకులు గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టుతో ఈ సీజన్ స్టార్ట్ కాబోతోంది అని తెలుస్తోంది. దీంతో ఈ సీజన్ అప్పుడే హాట్ టాపిక్ అయిపోతోంది. ఈ సీజన్‌పై ఇపుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఎనిమిదో సీజన్‌ను మరింత ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తాజా సమాచారం ప్రకారం అయితే ఈ సీజన్‌ను ఆగస్టు మొదటి వారం నుంచే స్టార్ట్ చేయబోతున్నారని వినికిడి. ఇందులో భాగంగానే నిర్వహకులు కంటెస్టెంట్ల ఎంపిక, హౌస్ వర్క్ గురించి ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా త్వరలోనే పనులు షురూ చేస్తారని టాక్ నడుస్తోంది.
ఇక ఎన్నో అంచనాల మధ్య ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ 8వ సీజన్‌కు సంబంధించి కంటెస్టెంట్ల ఎంపికలో అయితే ఈసారి పూర్తి వైవిధ్యాన్ని ప్రదర్శించబోతున్నట్లు కనబడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి కాంట్రవర్శీల్లో ఉన్న కొందరు సెలెబ్రిటీలను తీసుకు వస్తున్నారని గుసగుసలు వినబడుతున్నాయి. భారీ ఫాలోయింగ్ ఉన్న సోషల్ మీడియా ప్రముఖులపై ఎక్కువగా ఫోకస్ చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఇపుడు 2 జంటలను దింపి బిగ్ బాస్ జనాలకి కిక్కివ్వబోతున్నాడు అనే క్రేజీ న్యూస్ లీకైంది. ఈ సమాచారం ప్రకారం.. ఈ సీజన్లోకి ఏకంగా నిర్వహకులు రెండు జంటలను తీసుకు వస్తున్నారట. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలంటే ఒంకొన్ని రోజుల ఆగాల్సిందే!