లోక‌నాయకుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన‌ చిత్రం ఇండియన్ 2 (భార‌తీయుడు2). శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. 1996లో వచ్చిన ఇండియన్(భారతీయుడు) సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ రూపుదిద్దుకుంది. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, రెడ్ జైంట్ మూవీస్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. కాజ‌ల్ అగ‌ర్వాల్, సిద్దార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, బాబీ సింహా, స‌ముద్ర ఖ‌ని లు కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా జూలై 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందానికి తెలంగాణ ప్ర‌భుత్వం టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది. అంతేకాదండోయ్ స్పెష‌ల్ షోలు వేసుకునేందుకు వెసులుబాటు క‌ల్పించింది. తెలంగాణ రాష్ట్రంలోని సింగిల్ స్ర్కీన్స్‌లో రూ.50, మ‌ల్టీప్లెక్స్‌ల్లో రూ.75 చొప్పున టికెట్ పై ఏడు రోజుల పాటు పెంచుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది. వారం రోజుల పాటు ఐదో ఆట ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది.ఇదిలా ఉంటే ఈ సినిమాకి టికెట్‌ రేట్లు పెంచడమనేది లాభమా? నష్టమా అనేది చూస్తే.. ఇటీవలే తెలుగు ఆడియెన్స్ తోపాటు ఇండియన్‌ ఆడియెన్స్ కల్కి 2898 ఏడీ సినిమా చూశారు. దీనికోసం ఏకంగా ఐదు వందలు పెట్టారు. ఇప్పటికే సినిమా చూసిన వారి జేబులు గుళ్ల అయ్యాయి. ఇప్పుడు రెండు వారాల్లోనే మరో సినిమా, అది కూడా పెంచిన టికెట్‌ రేటుతో అంటే ఇది పెద్ద సవాల్‌తో కూడిన అంశమనే చెప్పాలి. దీంతోపాటు భారతీయుడు 2 సినిమాకి బజ్‌ లేదు. తెలుగు రాష్ట్రాల్లో అస్సలు బజ్‌ రావడం లేదు. ట్రైలర్‌ ఆకట్టుకోలేకపోవడంతో అంతగా ఆడియెన్స్ కి ఎక్కడం లేదు.

కమల్‌ హాసన్‌, శంకర్‌ అనే ఇద్దరు స్టార్‌ ఫేసులు, `భారతీయు`కి సీక్వెల్‌ అనేది తప్ప,  సినిమా కంటెంట్ పరంగా పెద్దగా ఎక్కడం లేదు. బజ్‌ క్రియేట్‌ కావడం లేదు. రిలీజ్‌కి మరో రెండు రోజులే ఉన్నా, ఏమాత్రం హైప్‌ లేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి టికెట్‌ రేట్లు పెంచుకోవడం పెద్ద నష్టమనే చెప్పాలి. సినిమా ట్రైలర్‌ ఏమాత్రం ఆకట్టుకోలేదు. దీంతో మూవీ ఎలా ఉండబోతుందో అనే అనుమానాలున్నాయి. ఆడియెన్స్ లో ఆసక్తి కనిపించడం లేదు. దీనికితోడు ఇప్పుడు టికెట్‌ రేట్లు పెంచడమనేది మరింత మైనస్‌గా మారే అవకాశం ఉంది. అంత పెట్టి సినిమా చూడాల్సిన అవసరం ఏముందిలే అని అనుకునే ఛాన్స్ ఉంది. సినిమా బాగుందనే టాక్‌ వస్తే టికెట్‌ రేట్లు పెంచినా పెద్ద సమస్య కాదు. ఆడియెన్స్ వస్తారు. కానీ ఏమాత్రం తేడా టాక్‌ వచ్చినా, కనీసం చూసేందుకు ఆడియెన్స్ రారు అనేది నిజం. టికెట్‌ రేట్లు తక్కువ ఉన్నా ఆలోచిస్తారు. అలా కాకుండా ఎక్కువ టికెట్‌ రేటుతో అంటే పెదవి విరిచే అవకాశాలున్నాయి. ఇది మొదటికే మోసం రావచ్చు. ఈ విషయంలో మేకర్స్ సరైన నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది.

మరింత సమాచారం తెలుసుకోండి: