పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన మూవీ బాక్సాపీస్‌ వద్ద రికార్డులను సృష్టిస్తున్నది. ఈ మూవీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నది. ఇక మూవీలో అబితాబ్‌ బచ్చన్‌, విశ్వనటుడు కమల్‌ హసన్‌, బాలీవుడ్‌ బ్యూటీలు దీపికా పదుకొనే, దిశా పటానీతో పాటు పలువురు అగ్రతారలు ప్రత్యేక పాత్రల్లో మెరిశారు. ఇది ఇలా ఉండగా.. మూవీలో ఓ శివాలయం కనిపించింది.అశ్వత్థామ గుడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మూవీలో అశ్వత్థామ ఎంట్రీ ఇచ్చే సమయంలో ఈ ఆలయం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఆలయం గురించి సోషల్‌ మీడియాలో తెగ వెతికేస్తున్నారు.ఇక ఆలయంలో శివాలయం నెల్లూరు జిల్లాలోని పెరుమాళ్లాపురం గ్రామం సమీపంలో పెన్నా నది ఒడ్డున ఉన్నది. పెన్నా నది వరదలకు ఇసుకలో కూరుకుపోయిన ఈ ఆలయం రెండు సంవత్సరాల కిందట వెలుగు చూసింది. కరోనా సమయంలో గ్రామస్తులు ఆలయం నది ఒడ్డున తవ్వకాలు జరుపుతున్న సమయంలో వెలుగులోకి వచ్చింది. దాదాపు 300 సంవత్సరాల కిందట ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురావస్తుశాఖ అధికారులు పేర్కొంటున్నారు.అలా పెరుమాళ్లపాడు ఫేమస్ కావడంతోపాటు చాలా మంది యూట్యూబర్లు, ప్రజలు ఈ ఆలయాన్ని చూసేందుకు క్యూ కడుతున్నారు.

పెరుమాళ్లపాడులో గుడి ఉన్నది నిజమే. కొన్నేళ్ల కిందట ఇది ఇసుకలో కూరుకుపోయింది.సుమారు మూడేళ్ల కిందట ఈ గుడిని చూసినప్పుడు అది ఎలాంటి స్థితిలో ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. కాకపోతే, ఇప్పుడు కల్కి సినిమా వల్ల చూడడానికి వస్తున్న సందర్శకులతో సందడిగా కనిపిస్తోంది.అది శివాలయమని, అక్కడ ఉన్నది నాగలింగేశ్వరుడని సోమశిల ప్రాంత ఆలయాల అధికారి  చెప్పారు.‘‘అది నాగలింగేశ్వరస్వామి దేవాలయం. అయితే గుడిని ఎవరు కట్టించారు? ఎన్ని వందల సంవత్సరాల క్రితం కట్టించారనేది తెలియదు’’ అని ఆయన అన్నారు.గుడి నిర్మాణం, ఏ కాలంలో దానిని నిర్మించారనే విషయాల గురించి స్పష్టమైన చారిత్రక ఆధారాలు ఏవీ లభించనప్పటికీ, ఆలయ నిర్మాణ శైలిని బట్టి అది చోళుల కాలం నాటిదిగా తెలుస్తోందని చరిత్రకారుడు ఈతకోట సుబ్బారావు చెప్పారు.‘‘ఆలయాన్ని గమనిస్తే చోళుల కాలం నాటిదిగా అనిపిస్తుంది. చోళులు 12, 13వ శతాబ్దంలో నెల్లూరు ప్రాంతం వైపు వచ్చారు’’ అని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: