పాన్ ఇండియా హీరో ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన కల్కి 2898AD సినిమా ఎంత విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా విడుదల ఇప్పటికి 14 రోజు అవుతున్న బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఇండియా వైస్ గా 535 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా విడుదల చాలా రోజులు కావడంతో ప్రస్తుతం కాస్త కలెక్షన్స్ తగ్గినట్లుగా తెలుస్తోంది. బాహుబలి సినిమాతో నార్త్ ఇండియాలో ఏ రేంజ్ లో సత్తా చాటాడు ప్రభాస్ ఇప్పుడు కల్కి సినిమా తో అదే రేంజ్ లో నార్త్లో సత్తా చాటుతున్నారు.


కీలకమైన పాత్రలో అమితాబ్ నటించడం ఈ సినిమాకి మరింత కలిసి వచ్చిందని చెప్పవచ్చు. అమితాబ్ అశ్వద్ధామ పాత్రలో మైమరిపించారు. కేవలం సినిమా చివర్లో మాత్రమే ప్రభాస్ పాత్ర కాస్త హైలైట్ గా చేయడం జరిగింది. అందుకే ఈ సినిమా హిందీలో 230 కోట్ల రూపాయల వరకు సాధించినట్లు తెలుస్తోంది. తెలుగులో 252 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా 11 వ రోజు బాక్సాఫీస్ విషయానికి వస్తే 900 కోట్ల రూపాయల వరకు రాబట్టినట్లు చిత్ర బృందం ప్రకటించింది.


ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమాని అధిగమించే సత్తా ఉన్నట్లు తెలుస్తోంది. 915 కోట్ల రూపాయలు యానిమల్ సినిమా సాధించింది. ఆదిశగా ఇప్పుడు కల్కి సినిమా కూడా అడుగులు వేస్తోంది. అమితాబచ్చన్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన ఆయన సినిమాలేవి ఇంతగా కలెక్షన్స్ ని రాబట్ట లేకపోయాయట.. కల్కి సినిమాతో భారీ విజయాన్ని సాధించడమే కాకుండా మొదటిసారి అశ్వద్ధామ గా కనిపించి మైమరిపించారు.ఈ సినిమాతో ఎనలేని పాపులారిటీ సంపాదించడమే కాకుండా ఒక అరుదైన గౌరవం వంటి పాత్రలో నటించిన నటుడుగా పేరుపొందారు అమితాబ్.

మరింత సమాచారం తెలుసుకోండి: