2023 లో విడుదలైన సినిమాలకు గాను ఫిలిం ఫేర్ సౌత్ అవార్డులను సైతం తాజాగా ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా దక్షిణాదిలో నుంచి ఏకంగా నాలుగు భాషలలో గత ఏడాది 2022 లో థియేటర్లో విడుదలైన చిత్రాలన్నీ కూడా లెక్కేసుకొని మరి ఓవరాల్ గా అవార్డులను సైతం ఫిలింఫేర్ అవార్డులను ప్రకటించింది.RRR చిత్రానికి ఏకంగా 7అవార్డులను సైతం రాబట్టడం జరిగింది. దీంతో అభిమానుల సైతం ఒక్కసారిగా అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే సీతారామం చిత్రానికి -5, భీమ్లా నాయక్ 1, విరాటపర్వం-2 అవార్డులను గెలుచుకున్నట్లు తెలుస్తోంది. మరి ఎవరెవరికి ఏవి భాగంలో అవార్డు దక్కించుకున్నదో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


1). ఉత్తమ చిత్రంగా-RRR సినిమా.
2). ఉత్తమ డైరెక్టర్-ఎస్ ఎస్ రాజమౌళి.
3). ఉత్తమ మూవీ (క్రిటిక్స్) సీతారామం.
4). ఉత్తమ నటుడుగా-రామ్ చరణ్ ఎన్టీఆర్, rrr
5). ఉత్తమ నటి-మృనాల్ ఠాగూర్ (సీతారామం)
6). ఉత్తమ నటుడుగా (క్రిటిక్స్) దుల్కర్ సల్మాన్ (సీతారామం).
7). ఉత్తమ సహాయ నటుడిగా-దగ్గుబాటి రానా (భీమ్లా నాయక్)
8). ఉత్తమ నటి-నందితాదాస్ (విరాటపర్వం)
9). ఉత్తమ లిరిక్స్ -సిరివెన్నెల సీతారామశాస్త్రి (సీతారామం).
10). ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ మహిళా (చిన్మయి సీతారామం)
11). ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ పురుషుడు-కాలభైరవ-RRR
12). ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్-సాయి సీరిల్ -RRR
13). ఉత్తమ కొరియోగ్రాఫర్-ప్రేమ్ రక్షిత్-RRR
14). ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్-కీరవాణి-RRR
15). ఉత్తమ నటి (క్రిటిక్స్) సాయి పల్లవి - (విరాటపర్వం).


ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమకు సైతం ఎన్నో అవార్డులు రాజమౌళి తీసుకువచ్చారు.. ముఖ్యంగా ఆస్కార్ అవార్డును సైతం rrr చిత్రంతో తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత కూడా అందించారు ఇప్పుడు ఎన్నో అవార్డులను కూడా తెలుగు సినీ పరిశ్రమకు అందించేలా చేస్తున్నారు రాజమౌళి. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటులే కాకుండా సింగర్స్ కూడా ఎన్నో అవార్డుల సైతం అందుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: