ఈ క్రమంలోనే తాజాగా ఎల్లీ బికినీ బీచ్ సెలబ్రేషన్స్ ఫోటోషూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఇసుకలో బికినీ సుందరి ఎల్లీ అందాలు కవ్విస్తున్నాయంటూ కుర్రాళ్ళు మెలికలు తిరిగిపోతున్నారు. 2013లో మిక్కీ వైరస్ చిత్రంతో ఎల్లీ బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది. తర్వాత కిస్ కిస్కో జబరియా జోడి, ప్యార్ కరూన్, మలంగ్, నానే వరువేన్, గణపత్ వంటి భారీ ప్రాజెక్ట్‌లలో నటించి మెప్పించింది. దాపు దశాబ్ధం పైగా కెరీర్ ఇక్కడ కొనసాగించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ మీడియా వేడిఅక్కగా మాట్లాడుతూ.. బాలీవుడ్లో నా ప్రయాణం అద్భుతంగా సాగిపోతుందని వ్యాఖ్యానించింది. అమీర్ ఖాన్ నుండి, సల్మాన్ ఖాన్ వరకు అందరూ తన ఫేవరేట్ హీరోలేనని ఎల్లీ చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా నన్ను నమ్మి నటించే అవకాశాలను అందించిన దర్శకనిర్మాతల థాంక్స్ చెప్పుకొచ్చింది.
ఆమె వైవిధ్యమైన పాత్రలు చేయాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు, నేను రకరకాల భాషలలో సినిమాలు చేస్తున్నాను. ఈ ప్రయాణం ఎంతో హాయిగా ఉందంటూ తెలిపింది. ఇలా చెప్పుకుంటూ పోతే, కుటుంబానికి దూరంగా ఉండటం ఒక్కటే నాకు అతిపెద్ద సవాల్ అని కూడా వాపోయింది ఈ అందాల భామ. ఈ నేపథ్యంలో ఆమె కోరికను కూడా చెప్పుకొచ్చింది... భారతదేశంలో తాను చాలా పెద్ద ఇల్లు కొనాలనుకుంటున్నాను అని, తరువాత తన కుటుంబాన్ని ఇక్కడకు రప్పించాలి.. తద్వారా నేను వారిని జాగ్రత్తగా చూసుకుంటాను. అని చెప్పుకొచ్చింది. త్వరలో ఆమె కోరిక తీరాలని ఆశిద్దాం.