టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి సందీప్ కిషన్ కొంత కాలం క్రితం ఊరు పేరు భైరవకోన అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తెలుగు లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి వి ఐ ఆనంద్ దర్శకత్వం వహించగా ... వర్షా బోల్లమ్మ , కావ్య ధాపర్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దానితో ఈ సినిమా యావరేజ్ మూవీ గా మిగిలి పోయింది.

ఆ తర్వాత ఈ మూవీ ఓ టి టి లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ సినిమా ఓ టీ టీ ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా బుల్లి తెరపై ప్రచారం అయింది. ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ చానల్లో ఒకటి అయినటువంటి జీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై జీ తెలుగు ఛానల్ వారు ప్రసారం చేయగా మొదటి సారి ఈ మూవీ బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 4.02 టి ఆర్ పి రేటింగ్ ను దక్కించుకుంది.

ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు మాత్రం పర్వాలేదు అనే స్థాయి టి ఆర్ పి రేటింగ్ ను తెచ్చుకుంది. ఇకపోతే ఈ సినిమాలో హీరో గా నటించిన సందీప్ హీరోయిన్ లుగా నటించిన వర్షా బొల్లమ్మ , కావ్య దాపర్ తమ నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: