కమల్‌ హాసన్‌, శంకర్ కాంబినేషన్ లో రూపొందిన ఇండియన్ 2 సినిమా ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత ఐదు సంవత్సరాల నుంచి ఈ సినిమా వాయిదాల మీద వాయిదా పడుతూ నేడు విడుదల అయ్యింది.ఇండియన్ 2 సినిమా ప్రమోషన్ సమయంలో ఇండియన్‌ 3 సినిమా ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే అందుకు సంబంధించిన కొంత షూట్‌ కూడా జరిగిందని డైరెక్టర్ శంకర్ ప్రకటించాడు. ఆ మధ్య కమల్ హాసన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఇండియన్ 2 సినిమా కంటే కూడా ఇండియన్ 3 పైనే ఆసక్తిగా ఉంది అన్నట్లుగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. అది నిజమే అన్నట్లు ఇండియన్ 2 సినిమా చూసిన తర్వాత అనిపిస్తుంది అని చాలా మంది కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇండియన్ 2 సినిమా పూర్తిగా నిరాశ పరిచిందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. 


కంటెంట్‌ తో పాటు కథ విషయంలో కూడా దర్శకుడు పూర్తిగా నిరాశ పరిచాడు అంటూ మాట్నీ షో నుంచి రివ్యూలు వస్తున్నాయి. పైగా టికెట్ రేట్లు కూడా తమిళనాడులో 190 ఆంధ్రాలో 350 ఉండటంతో సినిమాపై వ్యతిరేకత వస్తుంది. ఈ సినిమా కథ మొత్తం ఇండియన్‌ 3 లో ఉండే అవకాశాలు ఉన్నాయని అప్పుడే సీక్వెల్‌ కి సంబంధించిన చర్చ కూడా మొదలయ్యింది. బ్రిటిష్ యుద్దం ఇంకా 75 ఏళ్ల క్రితం భారత్‌ ను ఇండియన్ 3 లో చూపించే అవకాశాలు ఉన్నాయని ఇండియన్ 2 క్లైమాక్స్ తరువాత రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ ట్రైలర్ చూస్తుంటే చాలా ఆసక్తికరంగా ఉంది కానీ ఇండియన్ 3 మీద బజ్ పెరిగే అవకాశాలు అయితే ఇండియన్ 2 చూసాక లేవనే తెలుస్తుంది. ఇక ఇండియన్‌ 3 సినిమాని 2025 వ సంవత్సరంలో విడుదల చేయబోతున్నట్లు చూపించారు. ఇక శంకర్‌ ఆ సినిమాతో అయినా తన మార్క్‌ ను చూపించి సక్సెస్ కొడతాడో లేదో అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: