ఎంతో విభిన్నమైన కాన్సెప్ట్ లతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన.. అక్కడి ప్రేక్షకులు మాత్రం స్టార్ హీరోలకు ఒక్క హిట్ ఇవ్వలేకపోతున్నారు. ఇలా ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేక పోతుంది అని చెప్పాలి. కాగా ఇలా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చివరికి ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో నిరాశ పడిపోతున్న హీరోలలో అటు బాలీవుడ్ కిలాడిగా పేరు సంపాదించుకున్న అక్షయ్ కుమార్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు వరుస విజయాలతో ఇండస్ట్రీలని షేక్ చేసిన ఈ స్టార్ హీరో ఇక ఇప్పుడు హిట్ అందుకోక చాలా రోజులే అవుతుంది.
ఇక ఇటీవలే మరో కొత్త సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఆ మూవీ కూడా వర్కౌట్ అవ్వలేదు అని చెప్పాలి. తన సినిమాలు ఫ్లాప్ అవడం గురించి ఇటీవల అక్షయ్ కుమార్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన సినిమాలు ఫ్లాప్ అయితే కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటూ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ చెప్పుకొచ్చాడు. గత సినిమాలు బడే మియాన్ చోటే మియాన్, రామ్ సేతు, రక్షాబంధన్, బచ్చన్ పాండే, సెల్ఫీ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచాయి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇలా వరుస ప్లాపుల నుంచి ఎలాఎదుర్కొని కోలుకోవాలనే విషయాన్ని అమితాబచ్చన్ నుంచి నేను నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు అక్షయ్ కుమార్.