ఒకప్పుడు హీరో హీరోయిన్ల స్టార్ డమ్ మాత్రమే సినిమా జయాపజయాలని నిర్ణయించేది. కానీ ఇప్పుడు మాత్రం కంటెంట్ ఈజ్ కింగ్ అనే విధంగా మారిపోయింది పరిస్థితి. బలమైన కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాన్ని సాధించగలవు అని ఇప్పటికే ఎన్నో మూవీస్ నిర్ణయించాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి చిన్న సినిమాల విజయాలు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి టాలెంట్ నుంచి నిరూపించుకోవాలని ఎంతో మందిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయి. అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ మధ్యకాలంలో ఇలాంటి చిన్న సినిమాలే.. ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ సినిమాలుగా నిలుస్తూ ఉన్నాయి అని చెప్పాలి.


 ఇలాంటి ఒక కొత్తదనం ఉన్న కంటెంట్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయింది ద బర్త్ డే బాయ్ అనే సినిమా. ఈ మూవీలో సమీర్ మల్ల, రాజీవ్ కనకాల ముఖ్యపాత్రల్లో నటించారు. ఇక ఎక్కువమంది నూతన నటీనటులు కనిపించబోతున్నారు. బొమ్మ బొరుసా పతాకంపై భరత్ నిర్మిస్తున్నారు. విస్కీ ఈ మూవీకి దర్శకుడిగా వ్యవహరించారు. అయితే జూన్ 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇటీవల ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ఇక ఆ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ ట్రైలర్ ఈవెంట్ కి దర్శకుడు విస్కీ ఏకంగా మొహం కనిపించకుండా మాస్క్ వేసుకొని రావడం గమనార్హం.


 అప్పటికే కొత్త దర్శకుడు ఇక ఇప్పుడు ఇలా మాస్క్ వేసుకొని రావడంతో అతని మొహం ఎలా ఉంటుందో కూడా ఎవరు చూడలేకపోయారు. ఈ ఈవెంట్లో దర్శకుడు మాట్లాడుతూ.. 9 సంవత్సరాల క్రితం యదార్థ సంఘటన ఆధారంగా రాసుకున్న కథ ఇది అని తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది అంటూ చెప్పుకోచాడు. నా అసలు పేరును, నా ఫేస్ ను సినిమా విడుదలైన తర్వాతే రివీల్ చేస్తానని.  తప్పకుండా చిత్రం అందరికీ నచ్చుతుంది అని నమ్మకం ఉంది అంటూ డైరెక్టర్ విస్కీ చెప్పుకొచ్చాడు. దీంతో ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. సాధారణంగా కొత్తగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వారు తమ మొహాన్ని అందరికీ చూపించాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ డైరెక్టర్ ఏంటి ఇలా మొహం దాచుకొని సినిమా ఈవెంట్ కి హాజరయ్యారు అంటూ అందరూ చర్చించుకుంటూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: