ఇకపోతే ఇప్పుడు తన రెండో చిత్రాన్ని దిల్ రాజు సొంత సంస్థ అయిన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై చేస్తున్నాడు. పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్ శిష్యుడు కాశి ఇక ఈ మూవీకి దర్శకత్వం వహిస్తూ ఉండడం గమనార్హం. సెల్ఫిష్ అనే టైటిల్ ని ఈ మూవీకి ఖరారు చేశారు అన్నది తెలుస్తుంది. పాతబస్తీ నేపథ్యంలో కొనసాగే మాస్ ఎంటర్టైనర్ సినిమాగా ఈ మూవీ రూపొందుతుందట. అయితే కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తర్వాత ఏమైందో దిల్ రాజు ఈ మూవీ ని ఆపేసాడు. ఎక్కడో తేడా కొట్టడంతో కథలో మార్పులు చేయాలని దర్శకుడికి సూచనలు చేశాడట.
ఇక ఆ తర్వాత గ్యాప్ లో ఆశిష్ రెడ్డితో 'లవ్ మీ' అనే సినిమాను పట్టాలెక్కించగా.. ఇక ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ గా మిగిలిపోయింది. అయితే తన వారసుడి కెరియర్ను నిలబెట్టేందుకు ఇప్పటికే ఎన్నో కథలు విన్నారూ దిల్ రాజు. ఏ కథ నచ్చకపోవడంతో ఇక మళ్ళీ ఆపేసిన సినిమానే మొదలు పెట్టాలని దిల్ రాజు అనుకుంటున్నాడట. దర్శకుడు కాశి చేసిన మార్పులు నచ్చడంతో దిల్ రాజు ఇలా ఆపేసిన సినిమానే మళ్లీ పట్టాలెక్కించాడట. ప్రస్తుతం హైదరాబాదులో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది అనేది తెలుస్తుంది తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతుందని ఇక ఆశీష్ రెడ్డి కెరియర్ ను నిలబెడుతుందని దిల్ రాజు బలంగా నమ్ముతున్నాడట. ఏం జరుగుతుందో చూడాలి మరి.