ఒకవైపు చారిత్రక కట్టడాలు, మరోవైపు మోడ్రన్ బిల్డింగ్స్, ఇంకోవైపు ఐటీ టవర్లతో హైదరాబాద్ నగరం చూడదగిన సిటీగా అవతరించింది. ఇప్పుడు సొంత టైమ్స్ స్క్వేర్ కోసం పొందడానికి ఈ నగరం సిద్ధమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం T-స్క్వేర్‌ను ప్రకటించింది, ఇది న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వలె ఐకానిక్‌గా ఉంటుంది.  తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ రాయదుర్గం ప్రాంతంలో టి-స్క్వేర్‌ను నిర్మించడానికి ఆర్కిటెక్ట్‌లు, సలహాదారులను ఆహ్వానించింది. దానికంటే ముందు దీని డిజైన్ చేయాలి. ఆ పనిని కూడా  స్వీకరించింది.

తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని ప్రదర్శించేలా ఈ నిర్మాణాన్ని కట్టనున్నారు. ప్రజలకు సౌకర్యవంతమైన, ఆకర్షణీయమైన అనుభవాన్ని అందించేలాగా ఉండాలని కూడా స్పష్టం చేశారు. ఈ మల్టీఫంక్షనల్ ప్లాజా ఎప్పుడు పూర్తవుతుందనే వివరాలు ఇంకా తెలియ రాలేదు. రాయదుర్గం ప్రాంతంలో TGRTC, హైదరాబాద్ మెట్రో రైలు ద్వారా మంచి రవాణా సంబంధాలు ఉన్నాయి, కానీ బహిరంగ ప్రదేశాలు, సౌకర్యాలు లేవు. కాబట్టి, వినోదం, సౌలభ్యం, విశ్రాంతి కోసం వివిధ కార్యక్రమాలను నిర్వహించగల కేంద్రంగా టి-స్క్వేర్‌ను నిర్మించాలని ప్రభుత్వం కోరుకుంటోంది.

ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఎకో-ఫ్రెండ్లీగా ఉంటుంది. TGIIC రాయదుర్గ్‌లో ప్రజలకు ఒక ఎంటర్‌టైన్‌మెంట్, అట్రాక్టివ్ హబ్‌ను తీసుకురావాల్సిన అవసరం ఉందని గుర్తించింది. ఈ ప్రధాన పర్యాటక ప్రదేశం ఆవశ్యకతను అర్థం చేసుకోవడానికి కన్సల్టెన్సీ సేవల అవసరం ఉందని చెప్పింది.  ప్రాజెక్ట్ కోసం కాన్సెప్ట్ ప్లాన్, అత్యుత్తమ నిర్మాణాలను ప్రతిపాదించాలని, TGIICకి తగిన డెవలపర్‌ను కనుగొనడంలో సహాయపడాలని వారు సలహాదారులను కోరారు. మొత్తంమీద, చార్మినార్, హుస్సేన్ సాగర్, సైబర్ టవర్స్ వంటి ఈ ప్రాజెక్టును ప్రధాన నగర ల్యాండ్‌మార్క్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

భాగ్యనగరాన్ని విశ్వనగరంగా మారుస్తామని గతంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పారు. ట్యాంక్ బండ్ చుట్టూ ఆకాశాన్ని తాకే భవనాలను నిర్మిస్తామన్నారు. లండన్ థీమ్స్‌లో మూసీ నది డెవలప్ చేస్తామన్నారు, రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టులను కూడా అనౌన్స్ చేశారు కానీ ఏవీ స్టార్ట్ చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: