వెంటనే పోలీసులు లావణ్య నివాసానికి చేరుకొని ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే ఆత్మహత్యయత్నం ఎపిసోడ్ పూర్తయిన తర్వాత మరో ట్విస్ట్ ఇచ్చింది హీరో రాజ్ తరుణ్ బాధితురాలు లావణ్య. ఈ సందర్భంగా లావణ్య మీడియాతో మాట్లాడుతూ.... రాజేష్ అనే వ్యక్తి నాకు మెసేజ్ చేశాడని తెలియజేసింది. తాను ఒక అడ్వకేట్ అంటూ.... నీ కేసు నేను టేకప్ చేస్తానని మెసేజ్ పెట్టాడని మీడియా ముందు లావణ్య వెల్లడించింది.
అంతేకాకుండా నీకు యాక్టింగ్ అంటే ఇష్టం ఉంటే చెప్పు.... నీకు అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆఫర్ కూడా ఇచ్చారట. ఇప్పటికే ఎంతో బాధలో ఉన్న నన్ను రాజేష్ అనే అడ్వకేట్ మరింత ఇబ్బంది పెడుతున్నాడంటూ వెల్లడించింది. దీంతో జీవితంపై నాకు విరక్తి వచ్చింది. నన్ను అడగకుండానే.... నాకు తెలియకుండానే ఉదయం డిజిపి ఆఫీస్ కి వెళ్లి కలిసారని కూడా బాంబు పేల్చింది. దీంతో నేను ఒక్కసారిగా డిప్రెషన్ కి లోనయ్యానంటూ.... అందుకే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని లావణ్య వెల్లడించింది. నాకు నా రాజ్ కావాలి.. రాజ్ తరుణ్ నాకు దక్కకపోతే నేను ప్రాణాలతో ఉండనని తెలిపింది.
ఇక ఈ వ్యవహారం గురించి తెలిసిన లావణ్య తండ్రి..... సంచలన వాక్యాలు చేశారు. రాజ్ తరుణ్ అల్లుడుగా వస్తే ఇప్పటికీ స్వీకరిస్తామంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం లావణ్య తండ్రి చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి.