అలా కెరియర్ రిస్క్ లో ఉన్న సమయంలో మళ్లీ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో మంగళవారం సినిమాలో నటించి అద్భుతమైన నటనతో మరొకసారి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో మళ్లీ పాయల్ ఫామ్ లోకి వచ్చింది. ఇందులో తన నటనతో తన టాలెంట్ తో అందరిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమా తర్వాత పాయల్ ఫెట్ మారుతుంది అనుకున్నప్పటికీ తెలుగులో మళ్లీ అవకాశాలు పెద్దగా రాలేదు. దీంతో నెమ్మదిగా పాయల్ కోలీవుడ్ బాట పట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
కోలీవుడ్లో గోల్ మాల్, ఏంజెల్ వంటి సినిమాలలో నటించింది ఈ మధ్యనే తెలుగులో వచ్చిన రక్షణ సినిమాను కూడా పెద్దగా ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. కేవలం మంగళవారం సీక్వెల్ లోనే నటించే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ ముద్దుగుమ్మ.పాయల్ ఎక్కువగా గ్లామర్ పాత్రలోనే కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా విభిన్నమైన పాత్రలలో చేయాలని చూసిన దర్శకనిర్మాతలు ఈమెకు అలాంటి పాత్రలోనే ఆఫర్స్ ఇస్తారని ఎన్నోసార్లు తెలియజేసింది. సోషల్ మీడియాలో కూడా నిరంతరం యాక్టివ్గానే ఉంటూ హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది. కావలసినంత గ్లామర్ స్టఫ్ అందిస్తున్నప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతున్న సినిమా అవకాశాలు మాత్రం తగ్గుతూనే ఉన్నాయి. పాయల్ సినిమాలో ఉందంటే చాలు తన అందంతోనే సినిమాని మైమరిపిస్తుందని అభిమానులు తెలుపుతున్నారు