తాజాగా తన అడ్వకేట్ అయిన కళ్యాణ్ దిలీప్ సుంకరతో కలిసి నార్సింగ్ పోలీస్ స్టేషన్కు వద్దకు వెళ్లిన లావణ్య తన వద్ద ఉన్నటువంటి కొన్ని ఆధారాలను పోలీసులకు సైతం సబ్మిట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు లావణ్య ఆధారాలతో పాటు ఆమె స్టేట్మెంట్లు సైతం రికార్డు చేసినట్లుగా సమాచారం.. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్లో ఫిర్యాదు చేసిన దాని ప్రకారం అన్ని వివరాలతో కూడిన స్టేట్మెంట్ ని సైతం ఇచ్చినట్లుగా తెలిపింది.. అలాగే రాజ్ తరుణ్ తో పెళ్లికి సంబంధించి ఆధారాలు కూడా తాను సబ్మిట్ చేశానంటూ తెలిపింది.
తాను మాట్లాడిన అన్ని విషయాలు పోలీసులు రికార్డు చేశారని.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు సైతం తనను ఎలా భయపెట్టారు అనే విషయం మీద కాడ ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా సమాచారం.. రాజ్ తరుణ్ గురించి ఎవరెవరు ఏమేం మాట్లాడారు అనే విషయం మీద కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తెలియజేసింది.. అయితే ఈ స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత పోలీసులు సైతం విచారణకు అవసరమైనప్పుడల్లా రావాల్సి ఉంటుంది అంటూ లావణ్య కు హెచ్చరించినట్లు తెలియజేసింది. ఆమె మాత్రం తాను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే దర్యాప్తు కొనసాగాలి అంటూ తెలియజేసిందట. ప్రస్తుతం హైదరాబాదులో బోనాల పండుగలు జరుగుతున్న సందర్భంగా పోలీసుల బందోబస్తు డ్యూటీలో ఉన్న కారణంగా ఈ కేసు కాస్త ఆలస్యంగా ముందుకు వెళుతున్నట్లు లావణ్య లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర తెలియజేశారు.