బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఎంతో కష్టపడి సినిమాలు చేస్తున్నా అతనికి వరుసగా ఫ్లాప్స్‌యే ఎదురవుతున్నాయి. ఇటీవల అక్షయ్ హీరోగా "సర్ఫిరా" సినిమా వచ్చి అట్టర్ ఫ్లాప్ అయింది. తమిళ హీరో సూర్య నటించిన "సురారై పోట్రు" రీమేక్ ఇది. హిందీ ప్రేక్షకులకు ఇది నచ్చలేదు దాంతో కంప్లీట్ గా రిజెక్ట్ చేశారు. హిందీ ఫిలిం ఇండస్ట్రీలో వరుస హిట్లు కొట్టి అక్షయ్ కుమార్ దుమ్మురేపాడు కానీ ఇప్పుడు ఒక్క హిట్ కూడా కొట్టలేక చాలా సతమతమవుతున్నాడు.

హిందీ డైరెక్టర్లను నమ్ముకుంటే కెరీర్ పూర్తిగా నాశనం అవుతుందని భావించాడో ఏమో కానీ ఇప్పుడు అక్షయ్ కుమార్ కూ సౌత్ సినిమాల వైపు రావడానికి ప్రయత్నిస్తున్నాడు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ తనకు సౌత్ ఇండియన్ సినిమాల్లో యాక్ట్ చేయాలని ఉంది అంటూ తన మనసులోని మాటను బయట పెట్టాడు. అక్షయ్ కుమార్ ఇప్పటివరకు దక్షిణాది సినిమాల్లో యాక్ట్ చేయలేదు. మంచు విష్ణు టైటిల్ రోల్ లో నటిస్తున్న "కన్నప్ప" సినిమాలో శివుడి పాత్ర వేయనున్నారు. అదే అతనికి తొలి సౌత్ ఇండియన్ ఫిలిం అవుతుంది. దీని తర్వాత కూడా అతను తెలుగు సినిమాల్లో నటించాలని అనుకుంటున్నాట్లు తెలిపాడు.

అక్షయ్ కుమార్ హీరోలను ఫాలో అవ్వడు తనకంటూ ఒక స్టైల్ ఉంది అందువల్ల సౌత్ డైరెక్టర్లు అతనికి తగిన స్టోరీ ఉంటే అతడితో కలిసి ఒక సినిమా చేయొచ్చు. అతనికి కచ్చితంగా సూట్ అయ్యేలాగా కథలు రాసుకోవచ్చు. కెరీర్ లో ఎప్పుడూ ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతాడు అక్షయ్. కథ బాగుంది మంచిగా యాక్ట్ చేయగలిగితే తెలుగు ప్రేక్షకులు అతడిని కచ్చితంగా ఆదరిస్తారు.

అక్కి భాయ్‌ హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం ఐదారు మూవీస్ చేస్తుంటాడు. మరి అక్కి భాయ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే ఇక్కడ కూడా బిజీగా సినిమాలు చేసే అవకాశం ఉంది. అక్షయ్ తెలుగులో సోలో హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ వేరే బడా తెలుగు హీరోతో నటించే ఛాన్స్ అక్షయ్ వదులుకోకపోవచ్చు. మల్టీస్టారర్ సినిమాలు చేయడం ప్రస్తుతం కామన్ అయిపోయింది. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన సినిమాల్లో కొన్ని తెలుగులోనూ రీమేక్ అయ్యాయి. అవి ప్రేక్షకులను అలరించాయి కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: