కల్కి సినిమా చూశాను కాస్త స్లోగా అనిపించింది.. ఆల్మోస్ట్ ఒక అరగంట పాటు ఈ సినిమాలో సన్నివేశాలను తీసివేయవచ్చు అంటూ.. ముఖ్యంగా ఆ బాంబే హీరోయిన్ సాంగ్ ఫైట్ తీసేయవచ్చు అసలు ఆ సినిమా కథకు వారికి ఎలాంటి సంబంధం లేదని కూడా తెలిపారు. అలాగే సెకండాఫ్ బాగానే ఉంది డైరెక్టర్ విజువల్స్కి సెల్యూట్ అంటూ తెలియజేశారు. అలాగే అమితాబ్ రోల్ కూడా చాలా కీలకమని ప్రభాస్ పాత్రను డామినేట్ చేసేలా ఉందని తెలిపారు సుమన్.
అయితే ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని కానీ ఈ చిత్రంలో ప్రభాస్ కి ఏదో ప్లేట్ పెట్టి బాడీ కి షీల్డ్ కవర్ లాగా చేశారు ప్రభాస్ కి మంచి ఫిజిక్ ఉంది. అది ఈ సినిమాలో ఎక్కడైనా చూపిస్తారేమో అని అనుకున్నాను.. కానీ అలా జరగలేదు..సాంగ్స్ అయితే అసలు పూర్తిగా బాగలేవు.. ఈ సినిమా ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూస్తేనే నచ్చుతుంది అంటూ తెలియజేశారు సుమన్. ఈ వ్యాఖ్యలు సైతం అటు ప్రభాస్ అభిమానులను కాస్త నిరాశపరిచేలా ఉన్నాయి. మరి కొంతమంది ఫైర్ అవుతూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. దీపికా పదుకొనే ,కమలహాసన్ వంటి వారు కూడా ఇందులో నటించారు..