తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకురాలిలో సుధా కొంగర ఒకరు. ఈమె కొంతకాలం క్రితం సూర్య హీరోగా సూరారై పోట్రు అనే సినిమాను తెరకెక్కించింది. ఈ మూవీ తెలుగులో ఆకాశమే నీ హద్దురా అనే పేరుతో విడుదల అయ్యింది. ఈ సినిమా తమిళ్ , తెలుగు రెండు భాషలలో కూడా థియేటర్లలో కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ఫ్లాట్ ఫామ్  లో విడుదల అయింది. ఈ సినిమాకు తమిళ్ , తెలుగు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ మూవీ కి దర్శకత్వం వహించిన సుధా కు కూడా ఈ మూవీ ద్వారా ఈ రెండు ఇండస్ట్రీలలో అద్భుతమైన క్రేజ్ వచ్చింది.

ఇలా సూరారై పోట్రు సినిమాకు అద్భుతమైన ప్రశంసలు రావడంతో ఈమె ఈ సినిమాను హిందీ లో అక్షయ్ కుమార్ హీరోగా సర్ఫిరా అనే పేరుతో తెరకెక్కించింది. ఇకపోతే ఈ మూవీ మంచి అంచనాల నడుమ జూలై 12 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ దర్శకురాలు సుధా కొంగర ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

అందులో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. తాజా ఇంటర్వ్యూలో సుధా మాట్లాడుతూ ... ఒకే కథను రెండు భాషల్లో తెరకెక్కించడం అంత సులభైన విషమం కాదు. ఒకే కథను వేరు వేరు భాషల్లో తెరకెక్కించడం అనేది ఆనందంతో పాటు సవాళ్లతో కూడుకున్నది. మరి కొంత మంది ప్రేక్షకులకి మన కథ చేరువవుతుంది అనే సంతోషం ఎలాగైతే ఉంటుందో అలాగే ఆ కథ సారాంశంలో ఏ విధమైన తప్పులు జరగకుండా తెరకెక్కించడం చాలా పెద్ద సవాల్ తో కూడుకున్నది.

అక్షయ్ కుమార్ చాలా మంచి వ్యక్తి. సర్ఫిరా కథతో ఆయన వద్దకు వెళ్ళినప్పుడు ఈ కథ తనకే ఎంతో నచ్చింది అని , తప్పకుండా చేస్తాను అని చెప్పాడు. హిందీ మార్కెట్ కు అనుగుణంగా చిన్న చిన్న మార్పులు చేసి ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాం అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా సుధా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: