ఈ నేపథ్యంలో దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసాడు. బ్లడ్, భూతు, అశ్లీలత వంటి అంశాలు లేకుండా తీసిన మా చిత్రాన్ని ఆదరించి ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, అభిమానులు అందరికి ధన్యవాదాలు, రేపటికోసం.. అంటూ చేసిన ఒక పోస్ట్ ఇద్దరి దర్శకుల అభిమానుల మధ్య వివాదానికి కారణం అయింది. నాగి చేసిన పోస్ట్ యానిమల్ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డిని ఉద్దేశించి చేసాడని, సందీప్ రెడ్డి రీసెంట్ హిట్ ‘యానిమల్’ చిత్రంలో ఎక్కువ మోతాదులో వైలెన్స్ ఉండటం, ఆడవారిని తక్కువ చేసేలా చూపించడం వంటి అంశాలు వున్నాయి.నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు సందీప్ ను ఉద్దేశించినవే అని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.తాను చేసిన ఆ పోస్ట్ వివాదానికి కారణామవడంతో నాగ్ అశ్విన్ కాసేపటి తర్వాత ఆ పోస్ట్ ను తొలగించాడు. కానీ అప్పటికే జరగాల్సిన రచ్చ అంతా జరిగింది.అయితే గతంలో యానిమల్ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ “మహానటి చిత్రాన్నీ చూశాను, నేను అయితే ఇంకోలా తీసేవాడిని, భవిష్యత్తులో మహానటి లాంటి సినిమా చేస్తే ఇంకా బెటర్ గా తీస్తాను” అని సందీప్ తెలిపారు.అప్పటి సందీప్ కామెంట్స్ కు కౌంటర్ ఇప్పడు కల్కితో నాగ్ అశ్విన్ సమాధానం ఇచ్చాడని నాగి ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.. అలాగే సందీప్ ఫ్యాన్స్ కూడా స్పిరిట్ సినిమాతో ప్రభాస్ కు సందీప్ ఇంతకంటే భారీ హిట్ ఇస్తాడని సందీప్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.