చాలా సంవత్సరాల క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిన భారతీయుడు మూవీ కి కొనసాగింపుగా భారతీయుడు 2 అనే మూవీ ని శంకర్ తెరకెక్కించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో కమల్ హాసన్ హీరోగా నటించగా ... సిద్ధార్థ్ , రకుల్ ప్రీత్ సింగ్ , ప్రియ భవాని శంకర్మూవీ లో కీలక పాత్రలలో నటించారు. లైకా ప్రొడక్షన్స్ , రెడ్ గ్లంట్ సంస్థల వారు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ లో సముద్ర ఖని , ఎస్ జె సూర్య  ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ జూలై 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున తమిళ్ , తెలుగు , హిందీ భాషలలో విడుదల అయింది.

మూవీ కి విడుదల అయిన మొదటి రోజే భారీ ఎత్తున నెగటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి పెద్ద స్థాయిలో కలెక్షన్లు దక్కడం లేదు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 3 రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయింది. అందులో భాగంగా ఈ మూవీ కి 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధిస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

మూడు రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 5.17 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.48 కోట్లు , ఉత్తరాంధ్రలో 1.36 కోట్లు , ఈస్ట్ లో 79 లక్షలు , వెస్టు లో 50 లక్షలు , గుంటూరులో 1 కోటి ,  కృష్ణ లో 77 లక్షలు , నెల్లూరు లో 40 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 11.47 కోట్ల షేర్ ... 18.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 24 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 13.53 కోట్ల షేర్ కలక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: