సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కాంట్రవర్సీస్ అనేవి చాలా కామన్ అయితే ఇటీవల కాలంలో ఇవి చాలా ఎక్కువ అవుతున్నాయి. సినీ ఇండస్ట్రీ పరువును తీసేస్తూ షాక్‌కు గురి చేస్తున్నారు. ఇటీవల తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. హేమ పార్టీలో తమకు కనిపించిందని బెంగళూరు పోలీసులు కూడా చెప్పారు. కానీ ఆమె ఆ పార్టీలో తాను లేనని, తాను డ్రగ్స్ వాడలేదని బలంగా ఆరోపించింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది తెలుగు ఇండస్ట్రీకి రావాల్సిన మచ్చ వచ్చేసింది.
ఆమె నిజంగానే అందులో ఉన్నట్లు మంచు విష్ణు ఆమె "మా అసోసియేషన్" సభ్యత్వాన్ని రద్దు చేశారు. మరోవైపు ఆమెపై దారుణంగా టోల్స్ వచ్చాయి.
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ లవ్ అఫైర్ కారణంగా బాగా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఓ అమ్మాయి రాజ్ తరుణ్ తనను మోసం చేసినట్లు బాగా ఆరోపిస్తోంది. రాజ్ తరుణ్ తో మాట్లాడిన ఫోన్ కన్వర్జేషన్లను బయటపెట్టి మరీ అతడిని చాలా ఇబ్బందికి గురి చేస్తోంది. కొద్ది రోజుల్లో ఈ హీరో అరెస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు. ఆమె పేరు లావణ్య. మరి వీరిద్దరి మధ్య వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.
రాజ్ తరుణ్ సినిమా "తిరగబడరా సామీ" ఈ వివాదం వల్లే వాయిదా పడిందట. రాజ్ తరుణ్ కెరీర్ కూడా బాగా దెబ్బతింటోందని సమాచారం.కర్ణాటక రాష్ట్రంలో రేణుకాస్వామి మర్డర్ జరిగిన సంగతి తెలిసిందే. ఇది ఒక సెన్సేషనల్ న్యూస్ అయ్యింది. మృతుడు యాక్ట్రెస్ పవిత్ర గౌడకి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించాడని, కన్నడ స్టార్ దర్శన్ కొంతమందికి 50 లక్షల సుపారీ ఇచ్చి అతడిని మర్డర్ చేయించాడని రూమర్స్ నడిచాయి. కన్నడ సినిమా ఇండస్ట్రీకి ఇది ఒక పెద్ద మార్చలాగా మారింది.
సుచీలీక్స్ చేసే కోలీవుడ్ సింగర్ సుచిత్ర అప్పుడప్పుడు పెద్ద కాంట్రవర్సీలు సృష్టిస్తుంటుంది. త్రిష, ధనుష్ ల ఇంటిమేట్ ఫోటోలు, వీడియోలు ఆమె బయట పెట్టి షాక్కు గురి చేసింది. కోలీవుడ్ స్టార్ మన్సూర్ అలీ ఖాన్ టాలీవుడ్ సెలబ్రిటీల గురించి ఎప్పుడూ కాంట్రవర్షల్ కామెంట్స్ చేస్తుంటాడు. మాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీప్లెక్స్ వివాదానికి అతడు దారి తీశాడు. దీని ఫలితంగా ఆడు జీవితం సినిమా ప్రదర్శనకు సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి.